Mahesh Babu: తెలుగు చలన చిత్ర పరిశ్రమని శోకసంద్రం లోకి నెట్టేసిన సంఘటన సూపర్ స్టార్ కృష్ణ మరణించడం..ఆయన మరణాన్ని కుమారుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు కుటుంబ సభ్యులతో పాటుగా కోట్లాదిమంది అభిమానులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు..తెలుగు సినిమా ఇండస్ట్రీ కి విలువైన సంపద పోయిన భావన అందరిలో కలుగుతుంది..ఇక నిన్న కృష్ణ కి పెద్ద కర్మ నిర్వహించిన మహేష్ బాబు, అభిమానులందరికి 32 రకాల వంటకాలతో రుచికరమైన భోజనాలు పెట్టి పంపించాడు.

ఇక చాలా కాలం తర్వాత ఇటీవలే మహేష్ బాబు కృష్ణ మరణం గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పెట్టిన సంగతి తెలిసిందే..ఈ ట్వీట్ చూస్తే ఆయనకీ తండ్రి మీద ఎంత ప్రేమ ఉందొ అర్థం అయిపోతుంది..తాను అంతగా ప్రేమించిన తండ్రి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం..అందుకే గత వారం రోజుల నుండి నిన్న జరిగిన పెద్ద ఖర్మ వరుకు మహేష్ బాబు ఏకాంతంగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉండేవారట.
ఇక ఈ బాధ నుండి బయటపడడానికి పని ఒక్కటే మార్గం అని తెలుసుకున్నాడు మహేష్..అందుకే త్రివిక్రమ్ ని పిలిచి నెల రోజుల పాటు భారీ షెడ్యూల్ ని ప్లాన్ చెయ్యమని చెప్పాడట..ఎప్పుడో రెండు నెలల క్రితం ప్రారంభమైన వీళ్లిద్దరి కాంబినేషన్ మూవీ రెగ్యులర్ షూటింగ్, ఆ తర్వాత జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల ఆపేయాల్సి వచ్చింది..ఇప్పుడు అదే టీం తో వేరే కథ తో ఫ్రెష్ గా డిసెంబర్ మొదటి వారం నుండి విరామం లేకుండా షూటింగ్ జరగబోతుందని తెలుస్తుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుండగా..సెకండ్ హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తుంది..థమన్ సంగీతం అందిస్తున్నాడు..మార్చి నెలాఖరు లోపు మూవీ షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి ప్రమోషన్ బాగా చేసి ఆగస్టు 11 వ తారీఖున ఎట్టిపరిస్థితిలో అయినా సినిమాని విడుదల చెయ్యాలని మహేష్ త్రివిక్రమ్ కి చాలా కచ్చితంగా చెప్పాడట..అదే కనుక జరిగితే అతి తక్కువ రోజుల్లో షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఏకైక త్రివిక్రమ్ సినిమాగా ఈ ప్రాజెక్ట్ రికార్డ్స్ కి ఎక్కబోతుంది.