Hyper Aadi: బుల్లితెర స్టార్ కమెడియన్ హైపర్ ఆదికి తీరని అవమానం జరిగింది. అందరి ముందే అతనికి గుండు చేసి అవమానించారు. ఒక టాస్క్ లో భాగంగా హైపర్ ఆది ఇలా బలైపోయాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా ఈ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ తర్వాత అంత పాపులారిటీ తెచ్చుకుంది శ్రీదేవి డ్రామా కంపెనీ షో. సక్సెస్ ఫుల్ షోస్ ఢీ-జబర్దస్త్ మిక్స్ చేసి శ్రీదేవి డ్రామా కంపెనీ మల్లెమాల సంస్థ రూపొందించింది. జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు సినిమా, టెలివిజన్ స్టార్స్ ఇందులో పాల్గొంటారు.

గతంలో ఈ షోకి సుధీర్ యాంకర్ గా వ్యవహరించేవారు. అతడు వెళ్ళిపోయాక రష్మీ గౌతమ్ రంగంలోకి దిగింది. శ్రీదేవి డ్రామా కంపెనీలో కామెడీ స్కిట్స్, దుమ్మురేపే డాన్సులు, టాలెంట్ షోస్ వంటి అనేక వినోద కార్యక్రమాలు ఉంటాయి. అయితే హైపర్ ఆది షోకి స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటారు. ఆయన కామెడీ పంచెస్ నవ్వులు పూయిస్తాయి. ఇక మాజీ హీరోయిన్ ఇంద్రజ జడ్జి సీట్లో కూర్చుంటారు
కాగా లేటెస్ట్ ఎపిసోడ్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఒక గేమ్ లో బుక్ అయిన హైపర్ ఆది భారీ మూల్యం చెల్లించాడు. ఏకంగా అతడికి తోటి కమెడియన్స్ గుండు కొట్టారు. యాంకర్ రష్మీ ఫన్నీ గేమ్ నిర్వహించింది. స్క్రీన్ పై కనిపించే నెంబర్స్ నుండి ఒక నంబర్ ఎంచుకోవాలి. ఆ నెంబర్ వెనుక ఉన్న పని తప్పకుండా చేయాల్సి ఉంటుంది. హైపర్ ఆది ఈ గేమ్ ఆడేందుకు వచ్చాడు.ఫస్ట్ నెంబర్ 9 ఎంచుకున్నాడు. దాని వెనుక ఇష్టం వచ్చిన వారిని 30 సెకన్లు ముద్దు పెట్టుకోవచ్చని ఉంది.

దీంతో తన స్కిట్స్ లో చేసే ఐశ్వర్యను పిలిచాడు ఆది. ఆమెను ముద్దు పెట్టుకోవడానికి పొట్టి నరేష్ ఒప్పుకోలేదు. తర్వాత నెంబర్ గా 11 కోరుకున్నాడు. దాని వెనుక గుండు చేయించుకోవాలని ఉంది. దాంతో తోటి కమెడియన్స్ బలవంతంగా ఆదిని వేదికపైకి తీసుకెళ్లి గుండు చేసేశారు. అతనికి కమిట్మెంట్స్ ఉండొచ్చు, అలా చేయకండని ఇంద్రజ చెబుతున్నా వినలేదు. భాస్కర్ టాస్క్ అంటే టాస్కె అంటూ నున్నగా గుండు చేసి పారేశారు. నెక్స్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ప్రోమోలో ఈ ఆసక్తికర పరిమాణం చోటు చేసుకుంది. ఐతే అదంతా హైప్ కోసమే. ఎవరికో గుండు చేసి హైపర్ ఆదిలా కలరింగ్ ఇచ్చారు అంటున్నారు. ఎందుకంటే గుండు చేశాక ఆది ముఖం స్పష్టంగా చూపించలేదు.