
Rajamouli- Mahesh Babu Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలోనే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు రాజమౌళి. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కిస్తున్న సినిమా అని ఇదివరకే రాజమౌళి మీడియా కి తెలిపాడు. దీనికి సంబంధించిన వర్క్ షాప్ కూడా అతి త్వరలోనే ప్రారంభం కానుంది.
హాలీవుడ్ కి చెందిన టెక్నిషియన్స్ కూడా ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.అయితే ఈ సినిమా మొత్తం మూడు పార్ట్స్ లో రాజమౌళి తెరకెక్కించబోతున్నాడని రీసెంట్ గా ఒక న్యూస్ బయటకి వచ్చింది.ఇప్పుడు లేటెస్ట్ ఈ చిత్రం లో మహేష్ పోషించబోయ్యే పాత్ర గురించి కూడా ఒక సంచలన అప్డేట్ బయటకి వచ్చింది. రాజమౌళి తన సినిమాల్లో హీరో పాత్రలను మన ఇతిహాసాలను ఆధారంగా తీసుకొని డిజైన్ చేస్తూ ఉంటాడు, విలన్ పాత్రలకు కూడా ఆధారం మన ఇతిహాసాలు మరియు పురాణాలే.
ఇప్పుడు మహేష్ బాబు పాత్రకి కూడా ఆయన రామాయణం లోని ఆంజనేయ స్వామి పాత్ర ని ఆధారంగా తీసుకొని చేస్తున్నాడు అట.ఆంజనేయ స్వామి లో ఉన్నంత బలం ఈ చిత్రం లో మహేష్ బాబు పాత్రకి ఉంటుందట. ఇక రాజమౌళి హీరోలకు ఎలివేషన్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు,మహేష్ ని ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తాడో ఊహించుకోవచ్చు. ఈ చిత్రానికి KS రామారావు నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఎప్పుడో పదేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి కి అడ్వాన్స్ ఇచ్చాడు ఆయన.రాజమౌళి తన ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వడం, మరో పక్క మహేష్ బాబు కూడా తన ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వడం వల్ల ఇన్ని రోజులు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభం అవ్వలేదు.ఇప్పుడు రాజమౌళి కి పాన్ వరల్డ్ ఇమేజి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వడంతో ఈ సినిమా హిట్ అయితే హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడుతుందని అభిమానులు ఇప్పటి నుండే అంచనాలు వేస్తున్నారు.