
Husband And Wife Relationship: ఆలుమగల మధ్య అనుబంధం అంటే సంభోగమే. అది లేకపోతే ఇద్దరి మధ్య అనుబంధం ఉండదు. దంపతుల మధ్య అన్యోన్యత పెరగడానికి ఇది దోహదపడుతుంది. ఈ నేపథ్యంలో రతిక్రీడ ఇద్దరిలో ఎంతో ఉత్సుకత పెంచుతుంది. అనురాగం ఏర్పడటానికి కారణమవుతుంది. తొడ సంబంధం తొంభై ఏళ్ల అనుబంధం అన్నట్లు ఇద్దరికి ఎంతో సంతోషాన్నిచ్చేది ఇదే. దీంతో దీనికి ఎవరు కూడా అతీతులు కారు. తమ జీవితంలో మంచి ఉత్సాహం కావాలంటే ఇందులో పాల్గొనడంతోనే వస్తుంది.
సంభోగం తరువాత మనం కచ్చితంగా మూత్ర విసర్జన చేయాలి. ఆడ, మగ ఇద్దరు కూడా రతిలో పాల్గొన్న తరువాత మూత్ర విసర్జన చేస్తే యూరినరీ ఇన్ఫెక్షన్లు రావు. దీని వల్ల ఇద్దరికి మంచిదే. మనం రతి జరిపే సందర్భంలో బ్యాక్టీరియాలు లోపలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే మూత్ర విసర్జన చేస్తే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని తెలుసుకోవాలి.
సబ్బులతో కడగొద్దు
రతి తరువాత యోనిని సబ్బులతో కడగరాదు. సహజమైన నీటిని వినియోగిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి.ఏవో సౌందర్య సాధనాలు వాడితే సైడ్ ఎఫెక్టులు వచ్చే ఆస్కారం ఉంటుంది. అందుకే రతి అయిన తరువాత జననేంద్రియాలను శుభ్రం చేసుకునేందుకు చొరవ చూపాలి. కానీ సబ్బులు, ఇతర ఉత్పత్తులను వాడితే మనకు నష్టం కలగడం ఖాయం.
సువాసన ఉత్పత్తులు వద్దు
అక్కడ మంచి వాసన రావాలని సౌందర్య సాధనాలు వాడొద్దు. వీటి వల్ల మనకు ఇబ్బందులు ఏర్పడవచ్చు.జాగ్రత్తలు తీసుకుని సువాసన కోసం ఇతర దారులకు పోవద్దు. సహజమైన వాటితోనే మనకు మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాని ఏవో సరదాల కోసం పోయి లేని చిక్కులు తెచ్చుకోవద్దు. సరైన మార్గంలో వెళితేనే మనకు సురక్షిత మార్గాలు ఉంటాయి.
బిగువైన దుస్తులు
రతి తరువాత బిగువైన దుస్తులు ధరించొద్దు. వదులుగా ఉండే వాటిని వేసుకుంటేనే సౌకర్యంగా ఉంటుంది.సంభోగం చేసిన తరువాత బిగుతైన దుస్తులు ధరించడం వల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి. చెమటలు పడతాయి.అందుకే మనం రతి అయిన వెంటనే మనం బిగుతైన దుస్తులు వాడితే పలు రకాల నష్టాలు రావడం సాధారణం. దీన్ని అందరు గమనించుకుని వదులు దుస్తులు ధరించడమే మంచిది.