Mahesh Babu – Trivikram : మహేష్ త్రివిక్రమ్ మూవీ విడుదల తేదీ వచ్చేసింది..టైటిల్ ఇదే!

Mahesh Babu – Trivikram మహేష్ అభిమానులు మాత్రమే కాదు, టోటల్ టాలీవుడ్ ఎంతో ఆతృతగా వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ కోసం ఎదురు చూస్తూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.గత కొద్దిరోజుల క్రితమే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ సినిమా కి సంబంధించిన అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నారు..ఉగాదికి అప్డేట్ రావాల్సింది కానీ, కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఈరోజు అకస్మాత్తుగా నాలుగు గంటల 30 నిమిషాలకు […]

Written By: NARESH, Updated On : March 26, 2023 6:37 pm
Follow us on

Mahesh Babu – Trivikram మహేష్ అభిమానులు మాత్రమే కాదు, టోటల్ టాలీవుడ్ ఎంతో ఆతృతగా వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ కోసం ఎదురు చూస్తూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.గత కొద్దిరోజుల క్రితమే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ సినిమా కి సంబంధించిన అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నారు..ఉగాదికి అప్డేట్ రావాల్సింది కానీ, కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.

ఈరోజు అకస్మాత్తుగా నాలుగు గంటల 30 నిమిషాలకు ఒక అదిరిపొయ్యే అప్డేట్ ఉంటుంది అని ఒక ట్వీట్ వేసాడు..కానీ రాహు కాలం అంటూ మరో గంట వాయిదా వేసి ,6 : 30 నిమిషాలకు విడుదల చేసాడు.అదిరిపొయ్యే పోస్టర్ తో జనవరి 13 వ తేదీన సినిమాని విడుదల చేస్తునట్టు చెప్పుకొచ్చారు.ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో, సోషల్ మీడియా షేక్ అయిపోయింది.

మహేష్ బాబు కి సంక్రాంతి పండుగ ఎంతలా కలిసి వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఆయన సగం కెరీర్ మొత్తం సంక్రాంతి లోనే ఉంటుంది.ఎక్కువ హిట్స్ అందుకున్నది ఈ సీజన్ లోనే.రీసెంట్ గా ఆయన సంక్రాంతికి విడుదల చేసిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’.ఈ చిత్రం అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

మళ్ళీ అదే సంక్రాంతికి సినిమాని విడుదల చేయబోతుండడం తో ఫ్యాన్స్ ఈసారి ఏకంగా #RRR చిత్రం రికార్డ్స్ ని బద్దలు కొడుతాము అంటూ సవాళ్లు విసురుతున్నారు.చూడాలి మరి , ఇప్పటికైతే టైటిల్ ని అధికారికంగా ప్రకటించలేదు.సోషల్ మీడియా లో జరుగుతున్నా ప్రచారం ప్రకారం అయితే ఈ సినిమాకి ‘అటు అమరావతి ..ఇటు’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం.చూడాలి ఈ టైటిల్ ని ఎప్పుడు ప్రకటించబోతున్నారు అనేది.