https://oktelugu.com/

Mahesh Babu Sarkaru Vaari Paata movie review: రివ్యూ : ‘సర్కారు వారి పాట’.. హిట్టా? ఫట్టా?

నటీనటులు : మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రఖని, నదియా, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు. దర్శకత్వం: పరశురాం పెట్ల నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపి ఆచంట సంగీతం: థమన్ ఎస్ సినిమాటోగ్రఫీ: ఆర్ మధి ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్ సర్కారు వారి పాట… ఈ సినిమా రాక కోసం మహేష్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. టీజర్, ట్రైలర్ లలో మ్యాటర్ […]

Written By:
  • Shiva
  • , Updated On : May 12, 2022 / 09:31 AM IST
    Follow us on

    నటీనటులు : మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రఖని, నదియా, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు.

    దర్శకత్వం: పరశురాం పెట్ల
    నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపి ఆచంట
    సంగీతం: థమన్ ఎస్
    సినిమాటోగ్రఫీ: ఆర్ మధి
    ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

    సర్కారు వారి పాట… ఈ సినిమా రాక కోసం మహేష్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. టీజర్, ట్రైలర్ లలో మ్యాటర్ ఉండటంతో.. సినిమాలో కూడా అదే మ్యాటర్ కంటిన్యూ అవుతుందని ఆశించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూసి తెలుసుకుందాం.

    కథ :

    మహేష్ (మహేష్ బాబు) చిన్నతనంలోనే అతని తలిదండ్రులు తీసుకున్న లోన్ ను కట్టలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. దాంతో.. అప్పు పై మహేష్ కి బలమైన ఓ అభిప్రాయం కలుగుతుంది. ఆ కసితోనే మహేష్ పెరిగి పెద్దవుతాడు. యూఎస్‌ కి వెళ్లి లోన్ రికవరీ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. సక్సెస్ ఫుల్ గా బిజినెస్ రన్ చేస్తున్న మహేష్ ను కళావతి (కీర్తి సురేష్) మోసం చేస్తోంది. మహేష్ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా ఎస్కేప్ అవుతుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం కళావతి తండ్రి రాజేంద్రనాథ్ (సముద్రఖని) కథలోకి ఎంట్రీ ఇస్తాడు. రాజేంద్రనాథ్ కోసం మహేష్ వైజాగ్ కి వస్తాడు. రాజేంద్రనాథ్ తనకు పదివేల కోట్లు అప్పు ఉన్నాడని మహేష్ ట్విస్ట్ ఇస్తాడు. అసలు మహేష్ టార్గెట్ ఏమిటి? రాజేంద్రనాథ్ నే ఎందుకు టార్చర్ చేశాడు ? మహేష్ ఇదంతా దేని కోసం చేశాడు ? అసలు మహేష్ కి నదియాకి ఉన్న సంబంధం ఏమిటి ? అనేది మిగిలిన కథ.

    -విశ్లేషణ :

    సింగిల్ లైన్ లో చెప్పాలంటే.. సినిమా ఏవరేజ్. సినిమాలో యాక్షన్ అండ్ విజువల్స్ బాగున్నా.. సోల్ అండ్ ఎమోషన్ మిస్ అయ్యింది. సినిమాలో కామెడీ కోసం మహేష్ చాలా కష్టపడ్డాడు. కానీ, కష్టం కనిపించింది గానీ, కామెడీ పండలేదు. కీర్తి సురేష్ నటన గురించి చర్చ అనవసరం. కీర్తి మేకప్ ఆమె ఎక్స్ ప్రేషన్స్ ను కూడా డామినేట్ చేసే స్థాయిలో ఉంది. గ్లామరస్ రోల్ అనగానే పావు కిలో మేకప్ వేయాలని కీర్తి భావించడం నిజంగా బాధాకరమైన విషయం. పైగా మహేష్ – కీర్తి పాత్రల మధ్య కెమిస్ట్రీ కూడా సినిమాటిక్ గానే సాగింది.

    విలన్ గా నటించిన సముద్రఖని నటన బాగుంది. కాకపోతే.. ఆయనకు ఇచ్చిన పాత్ర, పాత కాలపు రావు గోపాలరావును గుర్తుకుతెస్తోంది. దానికి తగ్గట్టు సముద్రఖని కూడా అదే తరహా పాత మేనరిజమ్స్ ను వాడారు. నదియా పాత్ర చాలా ఎమోషనల్. అందుకే.. ఆమె, తాను స్క్రీన్ పై కనిపించినంత సేపు దీనంగానే ఫేస్ పెట్టడానికి ఉత్సాహ పడింది. వెన్నెల కిషోర్ గొప్ప కమెడియన్ అని మరోసారి ఘనంగా నిరూపించుకున్నాడు. కిషోర్ కామెడీ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్.

    సినిమా బడ్జెట్ కి, సాంకేతిక వర్గం పనితనానికి పొంతన లేదు. ఈ సినిమా చూసి ప్రేక్షకులు విజిల్స్ తో కేకలతో ఊగిపోవడాలు లాంటివి ఆశించలేం. మొత్తమ్మీద ఇది బోరింగ్ ప్లేతో సాగే లాజిక్ లెస్ సోషల్ డ్రామా.

    కాకపోతే, ఫస్ట్ హాఫ్ లో మహేష్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్, అలాగే ఇంటర్వల్ లో వచ్చే ఫైట్స్ బాగున్నాయి. ఎమోషనల్ గా సాగే ఈ సినిమా క్లైమాక్స్ కూడా బాగుంది. చివరగా తన గతం తాలూకు బాధను, అందుకు కారణం అయిన సిస్టమ్ ను మార్చే పాత్రలో మహేష్ మెప్పించాడు.

    -ప్లస్ పాయింట్స్ :

    మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్సీ,

    కీర్తి సురేష్ గ్లామర్ అండ్ వెన్నెల కిషోర్ కామెడీ.

    భారీ యాక్షన్ ఎపిసోడ్స్,

    మెయిన్ కథాంశం.

     

    -మైనస్ పాయింట్స్ :

    లాజిక్ లెస్ సోషల్ డ్రామా,

    స్లో నేరేషన్, రొటీన్ డ్రామా,

    బోరింగ్ ట్రీట్మెంట్, స్లోగా సాగే స్క్రీన్ ప్లే,

    సినిమాటిక్ టోన్ మరీ ఎక్కువ అవ్వడం,

    స్క్రిప్ట్ సింపుల్ గా ఉండటం.

     

    -సినిమా చూడాలా ? వద్దా ?

    ప్యూర్ సోషల్ డ్రామా వ్యవహారాలతో సాగిన ఈ సినిమాలో కొన్ని ఎమోషన్స్ అండ్ సీన్స్ బాగున్నాయి. కానీ, బోరింగ్ అండ్ రొటీన్ యాక్షన్ రెగ్యులర్ వ్యవహారాలు తప్పా.. సినిమాలో వినూత్న కహానీలు ఏమీ లేవు. కాకపోతే, మహేష్ నటన, సినిమాలో భారీ హంగులు ఆకట్టుకున్నాయి. మీరు టైమ్ పాస్ చేయాలనుకుంటే ఈ సినిమా చూడొచ్చు.

    oktelugu.com రేటింగ్: 2.75 /5
    Recommended Videos