Mahakumbh Monalisa: ఆమధ్య ఉత్తర ప్రదేశ్ లో కుంభమేళా జరిగినప్పుడు సోషల్ మీడియా వల్ల పూసలు అమ్ముకునే మోనాలిసా ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఏకంగా ఆమెకు సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. చేతినిండా అవకాశాలు ఉండడంతో ఆమె పూసలు అమ్ముకునే వృత్తిని పూర్తిగా వదిలిపెట్టింది. ప్రస్తుతం సినిమా షూటింగ్లలో బిజీబిజీగా ఉంది. అయితే అటువంటి మోనాలిసాకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
అమాయకపు చూపు.. నీలి కళ్ళు.. చూసేందుకు చూడ చక్కని రూపం.. సహజ సిద్ధమైన అందంతో మోనాలిసా కనిపించేది. అయితే ఎప్పుడైతే సోషల్ మీడియా ద్వారా గుర్తింపు వచ్చిందో అప్పుడే మోనాలిసా లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. నాచురల్ బ్యూటీ స్థానంలో మేకప్ వేయాల్సి వచ్చింది. నల్లటి జుట్టు కాస్తా రింగులుగా మారిపోయింది. ఆమె డ్రెస్సు స్టైల్ కూడా విభిన్నంగా మారిపోయింది. గ్లామర్ ఫీల్డ్ లో ఉంది కాబట్టి ఇవన్నీ కామన్. పైగా మోనాలిసాకు ప్రత్యేకంగా సోషల్ మీడియాలో అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి. ఇలా సాగిపోతున్న ఆమె జీవితం ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది. ఆ వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి మోనాలిసా ఇలా మారిపోయిందని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మోనాలిసా అత్యంత ఆధునికమైన డ్రెస్సులను ధరించి.. స్కిన్ షో చేసింది. అంతేకాదు జుట్టు కూడా ఆమె మాదిరిగానే స్వేచ్ఛగా విహరిస్తోంది. ఓ పాటకు అద్భుతమైన స్టెప్పులు వేస్తోంది. దీంతో ఒక్కసారిగా అందరికీ ఇదేంటనే విభ్రాంతి కలిగింది. మోనాలిసా ఇలా మారిపోయింది ఏంటని.. అందరిలోనూ ఒక రకమైన చర్చ మొదలైంది. అయితే ఇదంతా నిజం కాదట. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి..డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన వీడియో ఆట. సాంకేతిక పరిజ్ఞానం పెరిగితే ఎలాంటి మార్పులు వస్తాయో మోనాలిసా వీడియోనే ఒక నిదర్శనమని నెటిజన్లు అంటున్నారు.
OMG!! She is Monalisa from Mahakumbh mela
Money can change everything pic.twitter.com/p2vSP2miu7
— Sunanda Roy (@SaffronSunanda) September 25, 2025