Madhya Pradesh: దట్టమైన అడవులు కూనో నేషనల్ పార్క్ లో ఉంటాయి. ఇక్కడ చెట్లు.. జలపాతాలు విస్తారంగా ఉంటాయి. అందువల్లే ఇక్కడ జీవవైవిధ్యం బాగుంటుంది. జంతువులు కూడా స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. మనదేశంలో అతిపెద్ద టైగర్ సఫారీ ఉన్న అడవుల్లో కూనో నేషనల్ పార్క్ కూడా ఒకటి. వేసవికాలంలో పర్యాటకులతో ఈ ఆడవి సందడిగా ఉంటుంది. మన దేశం నుంచి మాత్రమే కాకుండా.. ఇతర దేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ టైగర్ సఫారిని ఆస్వాదిస్తుంటారు. కూనో నేషనల్ పార్క్ కు సమీపంలో ఉన్న గ్రామాల్లో ఆదివాసీలు నివసిస్తుంటారు. అడవిలో లభించే పండ్లను విక్రయిస్తుంటారు. ఈ ప్రాంతంలో లభించే తునికి పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
Also Read: గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ లో ఈ ఒక్కటి గమనించారా..?
అదే అతడి పాలిట శాపం అయింది
కూనో నేషనల్ పార్కులో చిరుతపులులు ఎక్కువగా ఉంటాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన జన్మదినం సందర్భంగా గత ఏడాది ఇక్కడ చీతాలను వదిలారు. నమిబియా నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన చీతాలను ఇక్కడి అడవిలో వదిలిపెట్టారు. ఇందులో కొన్ని చనిపోగా.. మరికొన్ని తమ సంతతిని వృద్ధి చేసుకునే పనిలో ఉన్నాయి. ఇవి ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా తమ శరీరాన్ని మార్చుకుంటున్నాయి. ఇక్కడ జింకలు కూడా విస్తారంగా ఉండడంతో చీతా లకు సమృద్ధిగా ఆహారం లభిస్తున్నది. అయితే ప్రస్తుతం ఎండాకాలం కావడంతో చిరుతపులులు తాగునీటి కోసం బయటికి వస్తున్నాయి . అయితే వాటికి అటవీ శాఖలో పనిచేసే సత్యనారాయణ గుల్జార్ అనే వ్యక్తి తాగునీరు పోశాడు. అతడు అటవీ శాఖలో చాలా సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్న నేపథ్యంలో.. జంతువులకు మచ్చిక అయ్యాడు. దీంతో అతడిని చిరుతపులులు ఏమీ అనలేదు. అతడు చిరుతపులులకు దాహార్తి తీర్చిన విషయం మంచి పరిణామం అయినప్పటికీ.. అటవీ శాఖ దీనిని తీవ్రంగా పరిగణించింది. క్రూర మృగాలకు అలా నీరు పోస్తే.. అవి తరచూ గ్రామాల మీదకి వస్తాయని.. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలపై దాడి చేస్తాయని.. అలా జరిగే పరిణామాల వల్ల ప్రాణ నష్టం తీవ్రంగా ఉంటుందని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు అటవీ శాఖలో పనిచేసే సిబ్బంది ఇలా క్రూర మృగాలకు దగ్గర కావద్దని.. అలా దగ్గరైతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. సత్యనారాయణ గుల్జర్ ను అటవీ శాఖ సస్పెండ్ చేయడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది. “దప్పికతో ఉన్న మూగ జీవాలకు అతడు నీరు పెట్టాడు. మానవత్వానికి ముందు తన శాఖలో ఉన్న నిబంధనల గురించి తెలుసుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు. పాపం అతడి పరిస్థితి చూస్తే జాలి వేస్తోందని” నెటిజన్లు అంటున్నారు.