Chintamaneni Prabhakar : ఏపీలో( Andhra Pradesh) అత్యంత వివాదాస్పద ముద్రపడిన నేతల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్( Chintamaneni Prabhakar ) ఒకరు. అయితే ఆయన వ్యవహార శైలి వివాదాస్పదం అవుతుందే తప్ప.. ఆయన ప్రజల పక్షం అన్నది స్థానికంగా ఉన్న వాదన. ప్రజల కోసం, తనను నమ్ముకున్న వారి కోసం ఆయన ఎంతవరకైనా ముందుకు వెళ్తారు. అటువంటి క్రమంలో దూకుడుగా ముందుకు సాగుతుంటారు. ఈ క్రమంలోనే ఆయనపై వివాదాస్పద ముద్ర పడింది. అయితే ఇప్పుడు ఆయన గతానికంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన వ్యవహార శైలి చూస్తుంటే చింతమనేని ఈజ్ గ్రేట్ అనే పరిస్థితికి వచ్చింది. చంద్రబాబు పిలుపుమేరకు ఆయనలో మార్పు వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read : ఉద్దానంలో ఆగని ‘కిడ్నీ మరణ మృదంగం’!..
* టిడిపి ద్వారా పొలిటికల్ ఎంట్రీ..
తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు చింతమనేని ప్రభాకర్. 2001లో టిడిపి తరఫున ఎంపీపీ అయ్యారు. తనకంటూ ఒక సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. 2009లో తొలిసారిగా టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దెందులూరు నుంచి విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2014లో సైతం విజయం సాధించి ప్రభుత్వ విప్ అయ్యారు. 2019లో మాత్రం ఓడిపోయారు. గత ఐదేళ్లుగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చింతమనేని విషయంలో టార్గెట్ చేసింది. అయినా ఎక్కడ వెనక్కి తగ్గలేదు. 2024 ఎన్నికల్లో మాత్రం ఘనవిజయం సాధించారు. అయితే గెలిచిన నాటి నుంచి వినూత్న కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ప్రజోపయోగ పనులు చేపడుతూ అందరి మన్ననలు అందుకుంటున్నారు.
* దూకుడుతో వివాదాలు..
చింతమనేని ప్రభాకర్( Chintamaneni Prabhakar) చాలా దూకుడుగా ఉంటారు. రాజకీయంగా చాలా వేగంగా స్పందిస్తారు. ఈ క్రమంలోనే 2011లో ఓ మంత్రిపై బహిరంగ వేదికపై చేయి చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఓ మహిళా తహసిల్దార్ విషయంలో అనుచితంగా ప్రవర్తించారన్న విమర్శను, అపవాదును మూటగట్టుకున్నారు చింతమనేని ప్రభాకర్. అయితే ఇటీవల చింతమనేని ప్రభాకర్ తీరులో మార్పు వచ్చింది. అయితే కొద్ది రోజుల కిందట ఆయన తన ప్రత్యర్థి కారు డ్రైవర్ విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై హై కమాండ్ సైతం ఆరా తీసినట్లు ప్రచారం జరిగింది. అయితే వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండేందుకు చింతమనేని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
* ముస్లింలకు మటన్..
ఏపీ వ్యాప్తంగా మొన్న రంజాన్ ( Ramzan)వేడుకలు జరిగాయి. దెందులూరు ముస్లింల జనాభా పరిమితంగా ఉంటుంది. ఓ 1000 కుటుంబాల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో రంజాన్ సందర్భంగా ఒక్కో ముస్లిం కుటుంబానికి కిలో మటన్ చొప్పున పంపించారు చింతమనేని. సుమారు 1000 కిలోల మటన్ పంపిణీ చేశారు. ఇంకోవైపు శ్రీరామనవమి( Sri Rama Navami) సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలో 500 ఆలయాలకు బెల్లాన్ని కూడా పంపించారు. ఇందుకుగాను అనకాపల్లి నుంచి టన్నులకొద్ది బెల్లాన్ని రప్పించారు. పానకం తయారీకి సంబంధించి ఒక్కో ఆలయానికి 15 నుంచి 20 కిలోల చొప్పున బెల్లాన్ని అందించారు. అయితే చింతమనేని మాదిరిగా మిగతా ఎమ్మెల్యేలు సైతం వ్యవహరిస్తే.. ఒక కొత్త ట్రెండ్ కు అలవాటు పడినట్టు ఉంటుంది. ఈ విషయంలో మాత్రం చింతమనేని మెచ్చుకోవాల్సిందే.
Also Read : దటీజ్ చంద్రబాబు.. ఓపెన్ గానే కేంద్రమంత్రి.. సెల్ఫీ కోసం ఆరాటం!