Madhya Pradesh : ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహరాజ్(Shambhaji Maharaj) జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ఛావా. ఈ సినిమా సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్(Box Office)వద్ద కోట్లు కొల్లగొడుతోంది. ఫిబ్రవరి 14న విడుదలైన సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 674.91 కోట్లు వసూలు చేసింది. సినిమా కథ శంభాజీ యొక్క ధైర్యం, మొగల్ సామ్రాజ్యంతో యుద్ధం, అతని జీవితంలోని ఉద్వేగభరిత క్షణాల చుట్టూ తిరుగుతుంది.
Also Read : వీడు మామూలోడు కాదు.. తల్లీకూతుళ్ళను ఒకేసారి గర్భవతులను చేశాడు.. వైరల్ వీడియో
మధ్యప్రదేశ్‌లో గుప్త నిధుల తవ్వకాలు:
మధ్యప్రదేశ్‌లో గుప్త నిధుల గురించి చారిత్రకంగా చాలా కథలు, ఊహాగానాలు ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్, అతని వారసులు తమ సామ్రాజ్య విస్తరణ కోసం సేకరించిన సంపదను రహస్య ప్రదేశాల్లో దాచినట్లు కొన్ని ఇతిహాసాలు చెబుతాయి. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్(Barhanpur), గ్వాలియర్(Gwaliar) వంటి ప్రాంతాలు మరాఠా చరిత్రతో ముడిపడి ఉన్నాయి. శంభాజీ మొగల్ చక్రవర్తి ఔరంగజేబు(Ourangajeb) చేతిలో బందీగా ఉన్నప్పుడు బుర్హాన్‌పూర్‌లో కొంత కాలం గడిపినట్లు చరిత్ర చెబుతుంది. మొగలులు దోచుకన్న సంపదను ఇక్కడ దాచినట్లు సినిమాలో చూపించారు. అయితే, ఈ ప్రాంతాల్లో గుప్త నిధులు ఉన్నాయని ఖచ్చితమైన ఆధారాలు లేవు.
సినిమా ప్రభావం..
‘ఛావా‘ మధ్యప్రదేశ్‌లో టాక్స్ ఫ్రీ చేయబడింది. బుర్హాన్‌పూర్, ఆసిర్‌గఢ్(Asirgadh)కోటలో మొగలులు తమ సంపదను దాచినట్లు ఈ సినిమాలో చూపించారు. దీంతో సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు లేదా స్థానికులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేడుతున్నారు. చీకటి పడగానే స్థానికులు పలుగు, పార పట్టుకుని తవ్వకాలకు బయల్దేరుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు తవ్వకాలు జరుపకుండా చర్యలు తీసుకుంటున్నారు. తవ్వకాలు జరిపితే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు.
సాధ్యమైన సంబంధం:
‘ఛావా‘ సినిమాలో శంభాజీ జీవితంలోని యుద్ధాలు, సంపద రక్షణ వంటి అంశాలు చూపించినప్పటికీ, గుప్త నిధులపై ప్రత్యేక దృష్టి లేదు. సినిమా చూసిన వారిలో మరాఠా సామ్రాజ్య సంపద గురించి ఆసక్తి పెరిగి, మధ్యప్రదేశ్ వంటి చారిత్రక ప్రాంతాల్లో నిధుల ఊహాగానాలు రేకెత్తినా ఆశ్చర్యం లేదు. ‘ఛావా‘ సినిమా మధ్యప్రదేశ్‌లో మరాఠా చరిత్ర పట్ల ఆసక్తిని పెంచింది.
Also Read : గుండెపోటుతో పెంపుడు కుక్క మృతి..బోరున విలపించిన మంత్రి సురేఖ.. వైరల్ వీడియో