https://oktelugu.com/

Minister Konda Surekha: గుండెపోటుతో పెంపుడు కుక్క మృతి..బోరున విలపించిన మంత్రి సురేఖ.. వైరల్ వీడియో

కుక్కల్లో విశ్వాసం ఎక్కువగా ఉంటుంది కాబట్టే మనుషులు వాటిని ఎక్కువగా దగ్గరికి తీసుకుంటారు. సైన్యంలో, వివిధ రక్షణ దళాలలో కుక్కలను విరివిగా వినియోగిస్తున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 7, 2025 / 09:44 AM IST
    Minister Konda Surekha

    Minister Konda Surekha

    Follow us on

    Minister Konda Surekha: శునకాలకు, మనుషులకు మధ్య అవినాభావ సంబంధం ఈనాటిది కాదు. జంతువుల్లో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ కుక్కలను మాత్రమే మనుషులు దగ్గరికి తీసుకుంటారు. వాటికి ఆహారం, నీరు అందిస్తూ మచ్చగా చేసుకుంటారు. సహజంగా కుక్కలకు విశ్వాసం ఎక్కువ కాబట్టి అవి మనుషులతో మరింత ప్రేమగా ఉంటాయి. తమ సహజ లక్షణాన్ని చూపిస్తుంటాయి.

     

    Also Read: కింగ్ స్టన్ ఫుల్ మూవీ రివ్యూ…

    కుక్కల్లో విశ్వాసం ఎక్కువగా ఉంటుంది కాబట్టే మనుషులు వాటిని ఎక్కువగా దగ్గరికి తీసుకుంటారు. సైన్యంలో, వివిధ రక్షణ దళాలలో కుక్కలను విరివిగా వినియోగిస్తున్నారు. వాటికి శిక్షణ ఇస్తూ.. శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగం కల్పిస్తున్నారు. ఒక్కోసారి శాంతి భద్రతల పర్యవేక్షణ సమయంలో కుక్కలు చనిపోతుంటాయి. వాటికి పోలీస్ శాఖ సగౌరవంగా దహన సంస్కారాలు నిర్వహిస్తుంది. పూర్వకాలంలోనూ కుక్కలను యుద్దాల సమయంలో వినియోగించేవారు. వాటికి యుద్ధ విద్యల్లో శిక్షణ ఇచ్చేవారు. అవి బలంగా పోరాడేందుకు పౌష్టికాహారం అందించేవారు. ఎక్కువగా మాంసాహారాన్ని పెట్టేవారు. తద్వారా ఆ కుక్కలు వేటాడేవి. ప్రత్యర్థులుగా మనుషులు ఉన్నా లెక్కచేసేవి కావు. వేటాడి వెంటాడి చంపేసేవి. ఇక జంతువులు ఎదురైతే ఏకంగా ఎదురుదాడికి దిగేవి.

    మారుతున్న కాలానికి అనుగుణంగా..

    ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా కుక్కలను పెంచుకోవడం ఎక్కువైపోయింది. సంప్రదాయ కుక్కలు మాత్రమే కాకుండా.. హైబ్రిడ్ జాతులను పెంచుకోవడం పెరిగిపోయింది. అయితే ఇలా పెంచుకున్న కుక్కలతో మనుషులకు అటాచ్మెంట్ పెరిగిపోతుంది. ఆపద ఎదురైనప్పుడు.. అనారోగ్యానికి గురైనప్పుడు పెంచుకున్న కుక్క చనిపోతే ఆ బాధ మామూలుగా ఉండదు. ప్రస్తుతం తెలంగాణ మంత్రి కొండా సురేఖ పరిస్థితి కూడా అలానే ఉంది. కొండా సురేఖ హ్యాపీ అనే పేరుతో ఉన్న ఓ కుక్కను పెంచుకుంటున్నారు. ఆ కుక్క వారి ఇంట్లో సభ్యుడిగా మెలుగుతోంది. కొండా సురేఖ కూడా ఆ కుక్కను అత్యంత ప్రేమగా చూసుకుంటారు. మంత్రిగా ఊపిరి సలపని పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ.. కొండా సురేఖ ఏమాత్రం కుక్కను నిర్లక్ష్యం చేయరు. దానికి తగ్గట్టుగా ఆహారం పెడతారు. దాని సంరక్షణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. పాలు, గుడ్లు, బిస్కెట్లు, ఇతర పౌష్టికాహారాన్ని హ్యాపీకి ఇస్తూ.. సురేఖ కూడా హ్యాపీగా ఉంటారు. అయితే సురేఖ ప్రేమతో పెంచుకుంటున్న హ్యాపీ గుండెపోటుకు గురైంది. హఠాత్తుగా చనిపోయింది. దీంతో కొండా సురేఖ కన్నీటి పర్యంతమయ్యారు. ఇన్ని రోజుల పాటు తమ కుటుంబాల్లో ఒక సభ్యుడిగా మెలిగిన హ్యాపీకి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది. అయితే కొండా సురేఖ తన పెంపుడు కుక్కకు అంతిమ సంస్కారాలు చేయడాన్ని కొంతమంది స్వాగతిస్తుండగా.. మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఎస్ ఎల్ బి సి టన్నెల్ లో చనిపోయిన వారికి ఎందుకు ఇలా అంతిమ సంస్కారాలు నిర్వహించలేదని.. కుక్క మీద ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేకుండా పోయిందని కొంతమంది మండిపడుతున్నారు. కుక్క మీద ఉన్న ప్రేమను తెలంగాణ ప్రజలపై కూడా చూపించాలని.. అప్పుడే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని మరికొందరి వ్యాఖ్యానిస్తున్నారు.