Madanapalle New Bride: ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూ ఊహించెదరు అన్నారో సినీకవి. వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికి తెలియవని కూడా చెబుతారు. మనిషి మనుగడలో ఎప్పుడు చనిపోతారో కూడా తెలియదు. దీంతో ఎన్నో ఆశలతో వివాహ బంధంతో ఒక్కటైన ఆ జంట ముచ్చట తీరలేదు. పచ్చని పందిళ్లు తీయనే లేదు. మొదటి రాత్రి సంబరం కానేలేదు. విధి ఆడిన వింత నాటకంలో వారే పాత్రధారులు అయ్యారు. ఎన్నో ఆశలు.. మరెన్నో ఊహలు.. కొత్త కాపురం.. నూరేళ్ల జీవితం అంటూ నవ వధువు ఎన్నో కలలు కన్నది. కానీ ఆమె కలలు కల్లలయ్యాయి. కొత్త జంటకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. పెళ్లయినా వారి సంబరాలు మాత్రం తీరలేదు. మురిపాలు కాస్త కన్నీళ్లుగా మారాయి.

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విషాదం జరిగింది. పెళ్లింట వరుడు అకస్మాత్తుగా మృతి చెందడం అందరిని కలచివేసింది. ఎన్నో ఆశలతో పడక గదిలో అడుగుపెట్టిన ఆమెకు షాక్ తగిలింది. వరుడు చనిపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. పెళ్లయి కనీసం పన్నెండు గంటలైనా దాటకముందే అతడు నిర్జీవంగా మారడంతో తీవ్ర విషాదం నెలకొంది. అనుకోని విధంగా వరుడు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఎన్నో ఊసులతో పడక గదిలో అడుగుపెట్టిన వధువుకు వరుడు తులసీ ప్రసాద్ అచేతన స్థితిలో పడిపోయి ఉండటం గమనించి లేపే ప్రయత్నం చేసినా కుదరలేదు. దీంతో కుటుంబ సభ్యులను పిలవగా వారు వెంటనే ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో రెండు కుటుంబాలు విలపించాయి. ఎలాంటి ముచ్చట జరగకుండానే అనంత లోకాలకు వెళ్లిన వరుడికి వీడ్కోలు పలికారు. విధి వెక్కిరించి నవదంపతుల కోరికలు తీరకుండా చేసిన దేవుడిపై శాపనార్థాలు పెట్టారు.
విధి కొత్త జంటపై పగబట్టింది. వారి ఆశలకు అడ్డుకట్ట వేసింది. సంతోషంతో గడపాల్సిన సమయంలో ఇలా జరగడంతో ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏక్షణాన ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. నూరేళ్లు హాయిగా సంసారం చేసుకోవాల్సిన వారు పెళ్లి తంతు ముగియగానే దంపతులను విడగొట్టడంపై రోదనలు మిన్నంటాయి. దంపతుల మధ్య అగాధం కలగడం అందరిని కలచివేసింది. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాలు తీరని శోకంలో మునిగాయి.