Bitthiri Satti Car: బిత్తిరి సత్తి ఈ పేరు తెలియని వారుండరు. తీన్మార్ వార్తలతో వెలుగులోకి వచ్చిన బిత్తిరి సత్తి అసలు పేరు రవి. సొంతూరు రంగారెడ్డి జిల్లా. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సత్తి అంచెలంచెలుగా ఎదిగాడు. పేదరికంలో పుట్టడం తప్పు కాదు కానీ పేదరికంలో చచ్చిపోవడం తప్పు అనే జీవిత సత్యాన్ని తెలుసుకున్న సత్తి జీవింలో ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ప్రస్తుతం అతడు ఒక్కో షోకు రూ. లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నాడు. ఫలితంగా అతడి జీవితమే మారిపోయింది. వినోదం పండించడంలో అతడికి అతడే సాటి. అతడికి లేరు పోటీ.
అసిస్టెండ్ డైరెక్టర్ గా అవకాశాల కోసం నగరానికి వచ్చిన సత్తికి వీ6 అవకాశం ఇవ్వడంతో అతడి సత్తా తెలిసిపోయింది. ప్రస్తుతం ఎన్నో ఈవెంట్లు, షోల్లో తనదైన శైలిలో రాణిస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఓ రేంజ్ కి చేరుకున్నాడు. ఏకంగా రోవర్ కారు కొనే స్థాయికి వెళ్లాడు. రోవర్ కారుకు రూ. 75 లక్షలు ఉంటుంది. అంత భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి కారు కొనుగోలు చేశాడంటే బిత్తిరి సత్తి సంపాదన ఏపాటిదో అర్థమైపోతోంది. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుని మంచి పారితోషికం తీసుకుంటున్న నటుడిగా నిలవడం గమనార్హం.
Also Read: Lucifer vs Godfather: లూసిఫర్ వర్సెస్ గాడ్ ఫాదర్… కీలకమైన ఆ మూడు పాత్రల నటనలో పైచేయి ఎవరిది?
పలు సినిమాలకు ప్రీ రిలీజ్ కు ముందు సత్తి చేసిన ఇంటర్వ్యూలు సినిమాలకు ప్లస్ అయ్యాయి. దీంతో బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేస్తే ఫలితం సినిమా హిట్టవుతుందనే నమ్మకం అందరిలో వస్తోంది. దీంతో చిన్న హీరోల నుంచి పెద్ద రేంజ్ హీరోల వరకు ఇంటర్వ్యూ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. విలువైన కార్లలో తిరుగుతూ స్టార్స్ సూపర్ స్టార్స్ కు వాంటెడ్ గా మారుతున్నాడు. కష్టానికి తగిన ఫలితం దక్కడంతో బిత్తిరి సత్తి అందరికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు.
పలు ఈవెంట్లలో దర్శనమిస్తున్నాడు. సామాజిక మాధ్యమాల్లో కూడా తనదైన శైలిలో పోస్టులు పెడుతుంటాడు. జీవితంలో ఎత్తుకు ఎదగాలనే ఉద్దేశంతోనే పరిశ్రమను ఏలాలని అనుకున్న సత్తి వాంఛ తీరినట్లు కనిపిస్తోంది. రోవర్ కారు కొనుగోలు చేయడంతో సత్తి సంపాదన బాగానే ఉందనే వాదన అందరిలో వస్తోంది. యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియాలో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. దీంతో అతడికి ఇటీవల కాలంలో అనుచరులు కూడా ఉండటంతో సత్తి అంటే ఒక వ్యక్తి కాదు మహత్తర శక్తి అనే అభిప్రాయం అందరిలో వస్తోంది.
Also Read:The Ghost Collections: ‘ది ఘోస్ట్’ మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం