Viral Video: కామా తురాణం నభయం నలజ్జ కామంతో కళ్లు మూసుకుపోతే ఏదీ కనిపించదు. నిద్ర వచ్చిన వారికి మంచమేదో పరుపేదో తెలియదు. ఆకలితో ఉన్నవాడికి ఏది పెట్టినా పరమాన్నంగానే భావిస్తాడు. పూటకూళ్లమ్మ పుణ్యమెరగదు. నేటి కాలంలో కూడా మన దేశాన్ని గౌరవించడానికి కారణం మనదేశ సంస్కృతి, సంప్రదాయాలే. విదేశీయులు సైతం మన కట్టుబాట్లకు ఫిదా అయిపోతారు. అందుకే ఏ దేశం అమ్మాయి అయినా భారత దేశంలోని సంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకోవాలని భావిస్తోంది. ఇంతటి మహత్తర చరిత్ర కలిగిన దేశం నానాటికి దిగజారిపోతోంది.

తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఓ పిచ్చి జంట చేసిన పనికి అందరు నిశ్చేష్టులయ్యారు. నడిరోడ్డు మీద వాహనంపై ముద్దులు కురిపించుకుంటూ వెళ్లడం చూస్తుంటే అందరికి మతిపోయింది. ఇంతగా బరితెగించడం చూస్తుంటే మనం మనుషులమా? జంతువులమా అనే అనుమానం కలుగుతోంది. మానవతా విలువలకు తిలోదకాలిస్తూ జంతువుల మాదిరి నడిరోడ్డుమీద చుంబనాలు కురిపించడం విచిత్రమే.
Also Read: Minister Roja: మంత్రి రోజా మళ్లీ రావాలన్న జబర్దస్త్ టీం
ఈ నెల 21న గుండ్లుపేట రోడ్డులోని యడపుర గ్రామం పరిసర ప్రాంతాల్లో నడిరోడ్డు మీద ప్రేమికులు ద్విచక్రవాహనం ట్యాంకు మీద ప్రియురాలు ప్రియుడికి ఎదురుగా కూర్చుని ముద్దులు పెడుతుంటే అతడు బైక్ వేగంగా నడుపుతున్నాడు. దీంతో వెనకాల వచ్చే వాళ్లు వీడియో తీసి అది కాస్త సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇంతటి జుగుస్సాకరమైన వీడియో చూసి నోరు వెళ్లబెడుతున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా కలికాలంలో ఇంతలా రాక్షసంగా మారడం యాదృచ్చికమేమీ కాదు. ఇదంతా కావాలనే చేసిందనే విషయం తెలుస్తోంది.

దీంతో బండి నంబర్ ఆధారంగా పోలీసులు వారిని గుర్తించి కేసు నమోదు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ నడిరోడ్డుపై పశువుల్లా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. మొత్తానికి నాగరికత పేరుతో విచ్చలవిడి శృంగారాన్ని కొనసాగించడం నిజంగా పొరపాటే. శృంగారమంటే బంగారంతో సమానం. అది నాలుగు గోడల మధ్య అయితేనే అందం. బరితెగిస్తే ఏముంటుంది అని అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. చేసిన పనికి వారు కూడా పశ్చాత్తాపపడుతున్నారు.