Uttar Pradesh Lovers: నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నాట్ట. గురివింద కూడా అందరిని వెక్కిరిస్తుందట. నలుపుగా ఉన్నా అదే వెక్కిరించడమేమిటని ఆశ్చర్యపోతారట. ఏదైనా మనకు నచ్చితే దేన్నయినా చేస్తాం. కానీ నాగరికత సమాజంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. కొన్ని విషయాలు బహిరంగంగా చేసుకోవడానికి వీలుంటుంది. ఇంకా కొన్ని నాలుగు గోడల మధ్యే చేసుకుంటే బాగుంటుంది. ఇటీవల కాలంలో సభ్య సమాజం గురించి పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఎలాంటి పనైనా జనం మధ్యలోనే చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఎవరైనా చూస్తారనే కనీస ఆలోచన కూడా లేకుండా బరితెగించి ప్రవర్తిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నడిరోడ్డుపై రెచ్చిపోయారు. ద్విచక్ర వాహనం మీద వెళ్తూ ముద్దుల వర్షం కురిపించారు. ట్రాఫిక్ ను సైతం లెక్కచేయకుండా వారి పని వారు చేసుకున్నారు. దీంతో చూసే వారంతా ఇదేం చోద్యం అంటూ నిట్టూర్చారు. ప్రజల మధ్య ఇలాంటి పనులు చేయడానికి కనీసం సిగ్గు కూడా లేకపోవడం చూస్తుంటే అందరికి ఇబ్బందిగా అనిపించడం మామూలే. కానీ వారు ఇవేమీ పట్టించుకోలేదు. వారి పని వారు చేసుకుంటూ పోయారు.
స్కూటీపై ఎదురెదురుగా కూర్చుని కిస్ లు పెట్టుకుంటూ పోవడంతో జనం కంగారు పడ్డారు. మరీ ఇంత తెగింపా? నాగరికత ప్రపంచంలో శృంగారానికి రానురాను విలువ తగ్గిపోతుందా? జంతు సంస్కృతి పెరుగుతోందా? అనే కోణంలో అందరు చర్చించుకోవడం కనిపించింది. ఇన్నాళ్లు జంతువులే బహిరంగంగా శృంగారం చేసుకునేవి ఇప్పుడు మనుషులు కూడా ప్రవర్తించడంపై ఆందోళన కలిగిస్తోంది. వినాశకాలే విపరీత బుద్ధి అన్న చందంగా మారింది పరిస్థితి. ప్రేమకు హద్దులు మారుతున్నాయి.
ఇదివరకు కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకరిని చూసి మరొకరు చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వారి ప్రవర్తన అనైతికమని, వారిపై మోటార్ చట్టం ప్రకారం శిక్షార్హమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు సమాజాన్ని తప్పు దారిలోకి తీసుకెళతాయని చెబుతున్నారు. సభ్య సమాజంలో ఉన్నప్పుడు సక్రమంగా ఉండాలి కానీ ఇలా విపరీత ధోరణిలో శృంగార కార్యకలాపాలకు పాల్పడటం నేరమే అని తేల్చారు.
https://www.youtube.com/watch?v=EleAxqqNPC0