Love Marriage in Nalgonda: ఈ మధ్య ప్రేమ పెండ్లిళ్లు చాలా కామన్ అయిపోయాయి. ముఖ్యంగా కాలేజ్ లోనో లేదంటే ఇంకేదైనా పనిచేసే చోట ఏర్పడిన పరిచయాలు కాస్తా ప్రేమ పెండ్లిళ్లకు దారి తీస్తున్నాయి. అయితే ఇలాంటి ప్రేమ పెండ్లిళ్లకు సినిమాలో లాగే అనేక సమస్యలు వెంటాడటం, చివరకు విడిపోవడం జరిగిపోతోంది. కలిసి బతుకున్న జంటలు చాలా తక్కువ. ఇప్పుడు మదనపల్లెలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

నల్గొండ జిల్లా చింతల పల్లె మండలం, కుడిమేకు గ్రామానికి చెందిన మహమ్మద్ సన తన భర్త కనిపించట్లేదంటూ అత్తింటి వారి ముందు ఆందోళనకు దిగింది. మదనపల్లె రూరల్ మండలం దిగువ వాండ్లపల్లెకు చెందిన రమేశ్ తో 2019లో ఈసెట్‌లో ట్రైనింగ్ తీసకుంటున్నప్పుడు ఏర్పడిన పరిచయం కాస్తా పెండ్లికి దారి తీసిందంటూ తెలిపింది సన.

Also Read: షాకింగ్: రాధేశ్యామ్ 2వ రోజు కలెక్షన్లు తెలిస్తే మతి పోవాల్సిందే?
తామిద్దరం రెండు నెలల కిందట జనవరి 4న మదనపల్లెలో ఉండే గుడిలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుని ఒక్కటైనట్టు సన వెల్లడించింది. అయితే తమకు పెండ్లి అయిన నాటి నుంచే అత్తింటి వారు వేధించడంతో.. విధిలేక రీసెంట్ గా మదనపల్లెలోని ఎస్టేట్‌లో అద్దె ఇల్లు తీసుకుని నివసిస్తున్నామని స్పష్టం చేసింది.

అయితే తమను విడదీయాలని మొదటి నుంచి రమేశ్ కటుంబీకులతో పాటు ఓ పొలిటికల్ లీడర్ ప్రయత్నిస్తున్నారని, తనను చాలా సార్లు వెళ్లిపోవాలంటూ బెదిరించారని సన తెలిపింది. ఇక తాను అనుమానిస్తున్నట్టే.. మూడు రోజులుగా తన భర్త కనిపించట్లేదని, బయటకు వెళ్లి తిరిగి రాలేదని వాపోయింది. తన భర్తను అత్తింటి వారే ఎక్కడో దాచిపెట్టినట్టు ఆరోపిస్తోంది. ఈ మేరకు పోలీసుకలు కూడా ఫిర్యాదు చేసింది. అయితే సన కుటుంబీకులే తమ కుమారుడిని కిడ్నాప్ చేశారంటూ రమేశ్ తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ రెండు ఫిర్యాదులపై విచారణ చేస్తున్నారు.
Also Read: అయ్యయ్యో.. షర్మిల పాదయాత్రను ఎవరూ పట్టించుకోరే..!