https://oktelugu.com/

Amigos Collections: ‘అమిగోస్’ కి 50 శాతం కి పైగా నష్టాలు..నందమూరి హీరోల విజయయాత్ర కి బ్రేక్

Amigos Collections: ‘అఖండ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో బాలయ్య బాబు కేవలం టాలీవుడ్ కి మాత్రమే కాదు, నందమూరి కుటుంబానికి కూడా పూర్వ వైభవం తీసుకొచ్చాడు.ఆ తర్వాత అదే కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ #RRR సినిమా తో పాన్ వరల్డ్ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించి, ఆస్కార్ అవార్డ్స్ వరకు తన పేరు ని మారుమోగిపోయ్యేలా చేసాడు.ఇక అసలు పూర్తిగా మార్కెట్ కోల్పోయిన నందమూరి కళ్యాణ్ రామ్ కూడా గత ఏడాది […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 14, 2023 / 11:00 AM IST
    Follow us on

    Amigos Collections

    Amigos Collections: ‘అఖండ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో బాలయ్య బాబు కేవలం టాలీవుడ్ కి మాత్రమే కాదు, నందమూరి కుటుంబానికి కూడా పూర్వ వైభవం తీసుకొచ్చాడు.ఆ తర్వాత అదే కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ #RRR సినిమా తో పాన్ వరల్డ్ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించి, ఆస్కార్ అవార్డ్స్ వరకు తన పేరు ని మారుమోగిపోయ్యేలా చేసాడు.ఇక అసలు పూర్తిగా మార్కెట్ కోల్పోయిన నందమూరి కళ్యాణ్ రామ్ కూడా గత ఏడాది ‘భింబిసారా’ చిత్రం తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 43 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకున్నాడు.

    Also Read: Dimple Hayathi: న్యూడ్ మసాజ్ ఫోటో లీక్ చేసిన రవితేజ హీరోయిన్..!

    అలాగే రీసెంట్ గా సంక్రాంతి కానుకగా ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో బాలయ్య బాబు మరో హిట్ కొట్టి నందమూరి హీరోల జైత్ర యాత్ర పరంపర ని కొనసాగించాడు, అలా వరుస విజయాలతో దూసుకుపోతున్న నందమూరి జైత్ర యాత్ర కి కళ్యాణ్ రామ్ తన ‘అమిగోస్’ చిత్రం ద్వారా బ్రేక్ వేసాడు.

    ఇటీవలే విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ని అయితే సొంతం చేసుకుంది కానీ, బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది.15 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగిన ఈ చిత్రానికి ఇప్పటి వరకు కేవలం 5 కోట్ల 30 లక్షల షేర్ మాత్రమే వచ్చింది.వీకెండ్ లో కాస్త ఉనికిని చాటుకున్నప్పటికీ , సోమవారం రోజు మాత్రం కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.షేర్స్ సంగతి కాసేపు పక్కన పెడితే ఈ చిత్రానికి గ్రాస్ వసూళ్లు రావడం కూడా నిన్న కష్టం అయిపోయింది.

    Amigos Collections

    ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని చూస్తూ ఉంటే మొన్న వీకెండ్ లో వచ్చిన షేర్ క్లోసింగ్ లాగ అనిపిస్తుంది, అంటే 50 శాతం కంటే ఎక్కువగా నష్టాలు వాటిల్లాయి అన్నమాట.బ్రేక్ ఈవెన్ టార్గెట్ తక్కువే అయ్యినప్పటికీ ఈ స్థాయి డిజాస్టర్ అవ్వడం తో నందమూరి అభిమానులు నిరాశకి గురయ్యారు.దరిదాపుల్లో మరో నందమూరి చిత్రం విడుదల కూడా లేకపోవడం తో సక్సెస్ కోసం ఈసారి ఎదురు చూపులు తప్పేలా లేదు.

    Also Read:Nani Dasara Movie: కెజిఫ్, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలతో దసరాకు పోలికా… వివరణ ఇచ్చిన హీరో నాని!

    Tags