Homeఎంటర్టైన్మెంట్Mahesh-Trivikram Movie: విడుదలకు ముందే కోట్ల నష్టం... మహేష్-త్రివిక్రమ్ కలిసి నిర్మాతను ముంచేశారే!

Mahesh-Trivikram Movie: విడుదలకు ముందే కోట్ల నష్టం… మహేష్-త్రివిక్రమ్ కలిసి నిర్మాతను ముంచేశారే!

Mahesh-Trivikram Movie: మహేష్-త్రివిక్రమ్ నెక్స్ట్ షెడ్యూల్ డిసెంబర్ మొదటివారంలో ప్రారంభం కానుంది. ఈ మేరకు టాలీవుడ్ వర్గాల నుండి విశ్వసనీయ సమాచారం అందుతుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక సెకండ్ హీరోయిన్ ఛాన్స్ పెళ్లిసందD ఫేమ్ శ్రీలీలకు దక్కింది అంటున్నారు. మహేష్ 28వ చిత్రంలో శ్రీలీల నటిస్తున్నట్లు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. మరో విశేషం ఏమిటంటే సీనియర్ నటి శోభన మహేష్ తల్లిగా నటిస్తున్నారట.

Mahesh-Trivikram Movie
Mahesh-Trivikram

శోభన మహేష్ తల్లి పాత్ర చేస్తున్నారనే మాట గట్టిగా వినిపిస్తోంది. తెలుగులో శోభన చివరి చిత్రం ‘గేమ్’. మోహన్ బాబు, మంచు విష్ణు నటించిన ఈ మూవీలో ఆమె మోహన్ బాబు భార్య రోల్ చేశారు. మహేష్ తల్లిగా ఆమె నటిస్తున్నారనే వార్త ఒకింత ఆసక్తి రేపుతోంది. ఇక 2023 సమ్మర్ కానుకగా త్రివిక్రమ్-మహేష్ మూవీ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ సూచనలు కనిపించడం లేదు. వివిధ కారణాలతో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ డిలే అయ్యింది.

కాగా మహేష్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ గురించి ఒక షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. హీరో దర్శకుడి నిర్ణయంతో చిత్ర నిర్మాత భారీగా నష్టపోయారు అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో మూవీ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్క్రిప్ట్ కి మార్పులు చేర్పులు చేశారట. పాన్ సబ్జెక్టు కి కావలసిన హంగులు అద్దారట. ఈ క్రమంలో ఫస్ట్ షెడ్యూల్ షూట్ మొత్తం వేస్ట్ అయ్యిందంటున్నారు. ఒక స్టార్ హీరో సినిమా ఒక షెడ్యూల్ బడ్జెట్ అంటే కోట్లలో ఉంటుంది. ఆ రకంగా మూవీ విడుదలకు ముందే నిర్మాత సూర్యదేవర నాగవంశీకి నష్టం తెచ్చిపెట్టారన్న వాదన తెరపైకి వచ్చింది.

Mahesh-Trivikram Movie
Mahesh-Trivikram

పాన్ ఇండియా సబ్జెక్టుగా చేద్దామనే ఆలోచన త్రివిక్రమ్ దే అయినప్పటికీ దానికి మహేష్ కూడా మద్దతు తెలిపారట.తాజా కథనాల నేపథ్యంలో SSMB 28 చిత్ర షూట్ మరలా మొదటి నుండి స్టార్ట్ అయినట్లే అంటున్నారు. ఇక బడ్జెట్ లెక్కలు, నిర్మాణ విలువలు కూడా మారిపోతాయి కాబట్టి… విడుదల కూడా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు వచ్చే ఏడాది రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. దర్శకుడు రాజమౌళి హీరోని లాక్ చేస్తే… ఇతర చిత్రాల్లో నటించే ఛాన్స్ ఉండదు. కాబట్టి రాజమౌళి మూవీ మొదలవ్వడానికి మునుపే త్రివిక్రమ్ షూట్ పూర్తి చేయాల్సి ఉంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
HYDRA Ranganath

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...
Kerala Innovation

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Arunachalam Moksha Margam

Arunachalam Moksha Margam: అరుణాచలం మోక్షమార్గం.. తెలుగు భక్తులకే ఎందుకీ కష్టాలు..

Arunachalam Moksha Margam: అప్పుడెప్పుడో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అరుణాచలంలో ప్రదక్షిణలు చేయాలని.. మోక్ష మార్గం నుంచి బయటికి రావాలని పిలుపునిచ్చారు. ఆయన చెప్పడమే ఆలస్యం తెలుగు భక్తులు అప్పటినుంచి...
Suryakumar Yadav

Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్.. నీ కష్టం పగ వాడికి కూడా రావద్దు బ్రో

Suryakumar Yadav:  అతడి నాయకత్వంలో టీమిండియా టి20 లలో ఒక్క ట్రోఫీ కూడా కోల్పోలేదు.. చివరికి టి20 వరల్డ్ కప్ కూడా సాధించింది. 2024లో రోహిత్ నాయకత్వంలో టీమిండియా అద్భుతం చేస్తే.. 2026లో...
Oktelugu Epaper