Waltair Veerayya Collections: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య ‘ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది..వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ మరియు యాక్టింగ్ ని చూసాము అంటూ అభిమానులు మురిసిపోతున్నారు..రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుండి వచ్చిన ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా ఇదేనని అందరూ చెప్పుకుంటున్నారు.

టీజర్ , ట్రైలర్ మరియు పాటలతోనే ఆ విషయం అర్థం అయ్యిపోయింది..అందుకే ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో జరిగాయి..మెగాస్టార్ గత రెండు చిత్రాలకు ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని కారణాల వల్ల జరగలేదు..ఈ సినిమాకంటే ముందుగా నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం విడుదలైంది..కాబట్టి థియేటర్స్ మరియు షోస్ తక్కువ దొరికాయి..ఆ తక్కువ స్క్రీన్స్ లోనే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ వీర సింహా రెడ్డి కంటే ఎక్కువ జరిగాయి.
ముందుగా ఓవర్సీస్ ప్రాంతం గురించి మనం మాట్లాడుకోవాలి..ప్రారంభం నుండి ‘వాల్తేరు వీరయ్య’ కంటే ఎక్కువ థియేటర్స్ మరియు షోస్ ‘వీర సింహా రెడ్డి’ చిత్రానికి కేటాయించారు..అందువల్ల ‘వాల్తేరు వీరయ్య’ గ్రాస్ నెంబర్ కాస్త తక్కువగా అనిపించింది..కానీ ప్రీమియర్స్ షోస్ ప్రారంభం అయ్యే సమయానికి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ‘వీర సింహా రెడ్డి’ ప్రీమియర్స్ ని భారీ మార్జిన్ తో దాటేయడం విశేషం..కేవలం ప్రీమియర్ షోస్ నుండే ఈ సినిమాకి 7 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది..నైజాం ప్రాంతం లో కూడా ఇదే పరిస్థితి..తక్కువ షోస్ ఉన్నప్పటికీ కూడా మొదటి రోజు ఇక్కడ దాదాపుగా 5 కోట్ల రూపాయిల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి..మొదటి రోజు పూర్తి అయ్యేసరికి ఈ సినిమా నైజాం నుండి 7 కోట్ల రూపాయిలు రాబట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

అలా ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్ బుకింగ్స్ ని చూస్తే ఈ చిత్రం కేవలం ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ నుండి మొదటి రోజు పాతిక కోట్ల రూపాయిల షేర్..వరల్డ్ వైడ్ గా 35 కోట్ల రూపాయిల షేర్ ని రాబడుతుందని అంచనా వేస్తున్నారు..టాక్ బాగుంది కాబట్టి మొదటి వారం లోనే ఈ సినిమా వంద కోట్ల రూపాయిల షేర్ ని రాబడుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.