Waltair Veerayya: ఓవర్సీస్ లో మెగాస్టార్ చిరంజీవి మరోసారి ప్రభంజనం సృష్టించేసాడు..రీ ఎంట్రీ తర్వాత మరోసారి రెండు మిలియన్ డాలర్లను వసూలు చేసి తన సత్తా చాటాడు..ఈ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ట్రేడ్ పండితులు సైతం విస్మయం కి గురయ్యే రేంజ్ వసూళ్లను సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది..పండగ సెలవుల్లో అద్భుతమైన వసూళ్లు వస్తాయని అందరూ ఊహించినదే.

కానీ వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..మెగాస్టార్ మాస్ లోకి దిగితే బాక్స్ ఆఫీస్ వద్ద ఇంత విద్వంసం జరుగుతుందా అని అందరూ ఆశ్చర్యపొయ్యేలా చేసింది..మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సినిమా ఆడాలంటే పబ్లిక్ టాక్ సరిపోతుంది కానీ..ఓవర్సీస్ లో మాత్రం రివ్యూస్ ని ఆధారంగా తీసుకొనే సినిమాకి వెళ్తారు.
కానీ ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి మొదటి నుండి డిజాస్టర్ రేంజ్ రివ్యూస్/ రేటింగ్స్ ఇచ్చారు..కానీ ప్రీమియర్స్ దగ్గర నుండి నేటి వరకు ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లను చూసి అక్కడి ట్రేడ్ కి సైతం మైండ్ బ్లాక్ అయ్యేంత పని అయ్యింది..ఈరోజుతో ఈ సినిమా అక్కడ రెండు మిలియన్ డాలర్లను వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది..డిజాస్టర్ రేటింగ్స్ తో పవన్ కళ్యాణ్ తర్వాత రెండు మిలియన్ డాలర్ల మార్కుని అందుకున్న ఏకైక హీరో గా మెగాస్టార్ చిరంజీవి నిలిచాడు..పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రానికి డిజాస్టర్ రేటింగ్స్ వచ్చినప్పటికీ కూడా ఫుల్ రన్ లో రెండు మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

ఇక అమెరికా లో నిన్నమొన్నటి వరకు అత్యధిక రెండు మిలియన్ డాలర్ల సినిమాలు కలిగియున్న హీరో గా సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచాడు..ఇప్పుడు ఆయనతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ జాబితాలోకి చేరాడు..రీ ఎంట్రీ తర్వాత ఆయన 5 సినిమాలు చేస్తే ‘వాల్తేరు వీరయ్య’తో కలిపి మూడు సినిమాలు రెండు మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టాయి..అలా 68 ఏళ్ళ వయస్సులో కూడా బాక్స్ ఆఫీస్ పరంగా నేటితరం స్టార్ హీరోలతో పోటీ పడుతున్నాడు మెగాస్టార్.