Byreddy Siddharth Reddy: సాక్షాత్తు ముఖ్యమంత్రికి ప్రైవేటు సైన్యం ఉందంటాడు ఆ యువనేత. ప్రజాస్వామ్యంలో ప్రైవేటు సైన్యం అనే మాటకే తావుండదు. అసలు అధికార పార్టీ నోట్లో ఆ మాటే ఉచ్చరించకూడదు. ప్రైవేటు సైన్యం ఎవరికి ఉంటుందో ఆ యువ నేతకు తెలుసో తెలియదో.. పాపం . అప్రజాస్వామిక రాజ్యంలో విలన్లకు మాత్రమే ప్రైవేటు సైన్యాలు ఉంటాయి. హీరోలకు కాదు. ఓ యువనేతా తెలుసుకో.

జగన్ తెలంగాణ రాజకీయాల్లో వేలుపెడితే ప్రకంపనలు వస్తాయని వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్దారెడ్డి చెప్పుకొచ్చారు. అంత పవర్ ఉన్నప్పుడు పెట్టొచ్చు కదా. మిమ్మల్ని ఆపేదెవరు ?. 2014లోనే మూట ముళ్లె సర్దుకుని ఏపీకి ఎవరు రమ్మన్నారు. తెలంగాణలో వైసీపీ క్యాడర్ ను నట్టేట్లో ముంచొచ్చిందెవరు ? ప‌్రజలు ప్రశ్నిస్తున్నారు. నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి యూట్యూబ్ లో ఫేమస్ అయిన బైరెడ్డికి ఆ విషయం తెలుసో లేదో. తెలుసుకోవాలి కదా బైరెడ్డీ. ఇప్పుడు తెలంగాణలో వేలు పెడితే ప్రకంపనలు వస్తాయంటే జనం నవ్విపోదురుగాక.
బైరెడ్డి మరో అడుగు ముందుకేసి జగన్ కు ప్రైవేటు సైన్యం ఉందని చెప్పాడు. ఇప్పుడు కూడ జగన్ కి ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదా ? అన్న ప్రశ్న జనంలో పుట్టింది. ప్రతిపక్షంలో అంటే నమ్మకం లేకపాయే. మరి సీఎంగా ఉన్నప్పుడు కూడ నమ్మకం లేదంటే ఎలా బైరెడ్డీ. పవన్ కళ్యాణ్ ని రంగం సినిమాలో విలన్ లాంటోడు అంటివి. ప్రైవేటు సైన్యాలు విలన్లకు ఉంటాయా ? . హీరోలకు ఉంటాయా ?. ఇప్పుడు హీరో ఎవరో.. విలన్ ఎవరో చెప్పకనే చెప్పితివి కదా బైరెడ్డీ అని జనం మాట్లాడుకుంటున్నారు.

బీఆర్ఎస్ ఏపీలో ఏం చేస్తుందో చూస్తాం అంటున్నావు. బీఆర్ఎస్ వస్తుందే వైసీపీ కోసమని జనం అంటున్నారు. జగన్ కు మేలు చేసేందుకే కేసీఆర్ కృషి చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు. లోపల మీరూ.. మీరూ ఒక్కటే. బయట మాత్రం ఇలా మాట్లాడితే ఎలా బైరెడ్డి. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏం ఉందని పవన్ ని ప్రశ్నిస్తివి. ఆ ప్రశ్న జనసైనికుడు వేసి ఉంటే సమాధానం వచ్చేది. ఎవరితో పొత్తు పెట్టుకోవాలో… పెట్టుకోవద్దో మీరే చెబితే ఎలా బైరెడ్డీ.