Liger USA box office collection : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం లైగర్ విడుదలకు ఒకరోజు ముందే అమెరికాను షేక్ చేస్తోంది. అమెరికా బాక్సాఫీస్ వద్ద గర్జిస్తూ రికార్డు కలెక్షన్లకు ముందే తెరతీసింది. అనన్య పాండే కథానాయికగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 24, బుధవారం అమెరికన్ థియేటర్‌లలో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ ప్రీమియర్స్ ద్వారానే $200K కంటే ఎక్కువ వసూలు చేసి ఈ చిత్రం చరిత్ర సృష్టించింది.
చిత్రం అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ మేరకు అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా 200k డాలర్లు వసూలు అయ్యాయని ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సరిగమ సినిమాస్ నుండి అమెరికా బాక్స్ ఆఫీస్ కలెక్షన్‌తో పోస్టర్‌ను షేర్ చేసింది. “#LigerHuntBegins. The Rage of #Liger అమెరికాలో $200K+ గ్రాస్ మరియు కౌంట్ తో ప్రభంజనం మొదలైంది అంటూ పోస్ట్ చేసింది.
ఆగస్ట్ 25న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ పాన్-ఇండియా చిత్రం లైగర్ హిందీ వెర్షన్‌లో గురువారం (ఆగస్టు 25) రాత్రి షోలు మాత్రమే ఉంటాయి. శుక్రవారం (ఆగస్టు 26) నుండి రెగ్యులర్ షోలు ఉంటాయి. మిగతా అన్ని భాషల్లో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ఆగస్ట్ 25నే. హిందీలో మాత్రం శుక్రవారానికి మార్చారు..
లైగర్ ఇప్పటికే తెలుగు బాక్సాఫీస్ వద్ద రూ. 84 లక్షలు, తమిళనాడులో రూ. 28 లక్షలు.. అడ్వాన్స్ బుకింగ్‌లలో సంపాదించింది. హిందీ బెల్ట్‌లో రూ. 4 లక్షలు సంపాదించాడు. హైదరాబాద్‌లో 15% షోలు ఇప్పటికే హౌస్‌ఫుల్‌గా ఉన్నాయని.. చాలా మంది టికెట్ల కోసం ఎదురుచూస్తున్నారని తేలింది.
రొమాంటిక్ లవ్ డ్రామా అర్జున్ రెడ్డిలో తన సంచలన నటనతో హిందీ ప్రేక్షకులను ఇప్పటికే ఆకర్షించిన తెలుగు సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ బాలీవుడ్ అరంగేట్ర చిత్రం లైగర్. షాహిద్ కపూర్ మరియు కియారా అద్వానీ నటించిన కబీర్ సింగ్‌గా హిందీలో రీమేక్ చేయబడింది. అయినా మన విజయ్ సినిమాను డబ్ చేయడంతో మన రౌడీ బాయ్ నటనకు అక్కడి వారు ఫిదా అయ్యారు.
లైగర్ లో రమ్యక్రిష్ణతోపాటు మాజీ అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్ భారతీయ సినిమాలో అరంగేట్రం చేస్తున్నాడు. రోనిత్ రాయ్ , మకరంద్ దేశ్ పాండేలు కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారు. లైగర్‌ను ధర్మ ప్రొడక్షన్స్‌పై కరణ్ జోహార్, పూరి కనెక్ట్స్ కింద పూరి జగన్నాథ్ , ఛార్మి కౌర్ కలిసి నిర్మించారు.ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం విజయ్ ప్యాన్ ఇండియా హీరోగా స్తిరపడడం ఖాయం. మరీ మన రౌడీ బాయ్ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందన్నది వేచిచూడాలి.
https://twitter.com/LigerMovieOffl/status/1562431025463971842?s=20&t=W6j-ZFrUvzmr4PAzKdQBKQ