Leopard Video: ఈ భూమ్మీద అత్యంత గొప్ప మనసు ఎవరిది అంటే మరో మాటకు తావు లేకుండా తల్లి అని వస్తుంది. తల్లి తాను తినకున్నా పిల్లలకు పెడుతుంది. తన స్తన్యాన్ని పిల్లలకు ఇస్తుంది. పిల్లల ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే మాతృదేవోభవ నానుడి పుట్టింది. కేవలం మనుషులకే కాదు.. జంతువులకు కూడా తల్లి అంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఆ తల్లికి కూడా పిల్లల మీద వెలకట్టలేని మమకారం ఉంటుంది. జంతువులు తమ పిల్లలపై చూపించే ప్రేమ అంచనాలకు అందని విధంగా ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈ తరహా వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తోంది.
ఆ వీడియోలో రోడ్డుమీద ఒక చిరుత పులి చనిపోయింది. దట్టమైన అడవి నుంచి రోడ్డు దాటుతుండగా ఒక ట్రక్కు దానిని ఢీకొట్టింది. వాహనం ఢీ కొట్టిన వేగానికి చిరుత పులి చనిపోయింది. రక్తమోడుతూ విగత జివిగా మారిపోయింది. దీంతో చనిపోయిన చిరుత తల్లి తల్లడిల్లిపోయింది.. తనతో నడిచి వచ్చిన కూన ఇలా చనిపోవడాన్ని చూసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. దాన్ని లేపడానికి ప్రయత్నించింది. దాని నుదుటి మీద ముద్దు పెట్టింది. ఎంతకీ అది లేకపోవడంతో నిస్సహాయత, బాధ తో అక్కడే కూర్చుని పోయింది.
ఎంతైనా తల్లి ప్రేమ కదా
తల్లి ప్రేమ గొప్పది. అది కేవలం పిల్లల క్షేమాన్ని.. ఉన్నతిని మాత్రమే కోరుకుంటుంది.. జంతువుల కైనా.. మనుషులకైనా ఇదే వర్తిస్తుంది.. ఆ చిరుత పిల్ల అలా చనిపోవడంతో.. దాని తల్లి తీవ్రమైన కలత చెందింది. కన్నీరు పెట్టుకుంది. గుండె బరువెక్కి అక్కడే కూర్చుండిపోయింది. ఆ చిరుత పిల్ల రోడ్డు దాటుతున్నప్పుడు వాహనాన్ని తోలుతున్న వ్యక్తి కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుండేది. అతని అజాగ్రత్త వల్ల చిరుత పులి పిల్ల చనిపోయింది. కళ్ళముందే తాను కన్న కూన కన్ను మూయడంతో తల్లి తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయింది. ఇంతటి విషాదం.. ఇంతటి ఘోరం మనుషులకి ఎదురైతే ఎలా అయితే విలపిస్తారో.. చిరుత పులి కూడా అలానే విలపించింది. అందుకే అంటారు తల్లి ఉన్నచోట ప్రేమ ఉంటుంది. కోలుకోలేని కష్టం వస్తే అనంతమైన దుఃఖం కూడా ఉంటుంది అని.. ఈ సంఘటన ద్వారా అది మరోసారి నిజమైంది.