LEO – Bloody Sweet Promo : లియో: బ్లడీ స్వీట్ ఫస్ట్ ప్రోమో రివ్యూ… విజయ్ కత్తికి బలి కానున్న గ్యాంగ్, నెక్స్ట్ లెవెల్ సామీ!

LEO – Bloody Sweet Promo : క్రైమ్ థ్రిల్లర్స్ లో పీక్స్ చూపిస్తున్నాడు లోకేష్ కనకరాజ్. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కించిన విక్రమ్ బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. కమల్ హాసన్ కెరీర్లో అతిపెద్ద హిట్ నమోదు చేసింది. విడుదలైన అన్ని భాషల్లో ఆదరణ దక్కించుకున్న విక్రమ్ నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఖైదీ చిత్రంతో మొదలైంది. ఖైదీలో కార్తీ హీరోగా నటించారు. ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకుండా […]

Written By: NARESH, Updated On : February 3, 2023 9:38 pm
Follow us on

LEO – Bloody Sweet Promo : క్రైమ్ థ్రిల్లర్స్ లో పీక్స్ చూపిస్తున్నాడు లోకేష్ కనకరాజ్. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కించిన విక్రమ్ బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. కమల్ హాసన్ కెరీర్లో అతిపెద్ద హిట్ నమోదు చేసింది. విడుదలైన అన్ని భాషల్లో ఆదరణ దక్కించుకున్న విక్రమ్ నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఖైదీ చిత్రంతో మొదలైంది. ఖైదీలో కార్తీ హీరోగా నటించారు. ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకుండా ప్రయోగాత్మకంగా ఖైదీ తెరకెక్కింది. స్క్రీన్ ప్లే మొత్తం ఒక నైట్ లో సాగుతుంది. ఖైదీ చిత్రంతో లోకేష్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.

విక్రమ్ విజయంతో లోకేష్ ఫేమ్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. టాప్ హీరోలు ఆయనతో మూవీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా లోకేష్ దళపతి విజయ్ 67వ చిత్రానికి సైన్ చేశారు. విక్రమ్ మూవీ సమయంలోనే ఈ ప్రాజెక్ట్ లాక్ చేసినట్లు సమాచారం. స్క్రిప్ పూర్తి చేసిన లోకేష్ కనకరాజ్ షూటింగ్ కూడా కొంత జరిపారు. నేడు టైటిల్ ప్రకటిస్తూ ప్రోమో విడుదల చేశారు. జస్ట్ కాన్సెప్ట్ వీడియో రెండు నిమిషాలకు పైగా ట్రైలర్ రేంజ్ లో రూపొందించారు.

‘లియో: బ్లడీ స్వీట్’ చిత్ర టైటిల్ గా నిర్ణయించారు. ఇక ప్రోమో గూస్ బంప్స్ కలిగించింది. హీరో విజయ్ చాక్లెట్ ఫ్యాక్టరీలో స్వీట్, ఖార్కానాలో కత్తి ఏక కాలంలో తయారు చేస్తున్నారు. ఇనుము కరిగించి కత్తి తయారు చేస్తుంటే… మరోవైపు గ్యాంగ్ అతని కోసం కారుల్లో దూసుకొస్తోంది. తన చాక్లెట్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చిన శత్రు మూకలపై దాడి చేయడానికి విజయ్ కత్తి పట్టుకొని సిద్ధమయ్యారు. సినిమా థీమ్, హీరో క్యారెక్టరైజేషన్ తెలియజేస్తూ… లోకేష్ రూపొందించిన వీడియో మైండ్ బ్లాక్ చేసిందంటే నమ్మండి.

లోకేష్ కనకరాజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్స్ మేకింగ్ లో హాలీవుడ్ డైరెక్టర్స్ ని మించిపోతున్నాడు. విక్రమ్ మూవీలో హీరో కమల్ సంతానాన్ని చంపి డ్రగ్ మాఫియాను కూకటి వేళ్ళతో సహా పీకేస్తాడు. తన కొడుకును చంపినవారిపై పగ తీర్చుకుంటాడు. అయితే విక్రమ్ కూల్చిన మాఫియా సామ్రాజ్యం మళ్ళీ నిర్మించేందుకు రోలెక్స్ రంగంలోకి దిగుతాడు. విక్రమ్ తన మనవడితో పాటు రోలెక్స్ ని ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతాడు. విక్రమ్ సినిమాను ఇలా ముగించడం జరిగింది.

మరి లియో: బ్లడీ స్వీట్ చిత్రంలో ఆయన విజయ్ చుట్టూ ఎలాంటి మాఫియా సామ్రాజ్యం అల్లుతాడు. కథలో ఎలా లింక్ చేస్తాడు అనేది చూడాలి. విజయ్ కి జంటగా త్రిషా నటిస్తున్నారు. విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నారు. అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా ఆనంద్ వంటి స్టార్ క్యాస్ట్ నటించారు. ప్రోమోతో పాటు విడుదల తేదీ కూడా ప్రకటించారు. 2023 అక్టోబర్ 10న విడుదల చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.