Lavanya Tripathi: అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని… ఈ సామెత లావణ్య త్రిపాఠికి చక్కగా సరిపోతుంది. చక్కని రూపం, కట్టిపడేసే నటన ఉండి కూడా లావణ్య స్టార్ కాలేకపోయింది. మంచి ఆరంభం లభించినా పునాది వేసుకోలేకపోయింది. లావణ్య కెరీర్లో ఓడిపోయిన తీరు నిజంగా విచారకరం. సీరియల్ యాక్ట్రెస్ గా కెరీర్ మొదలు పెట్టిన లావణ్యకు దర్శకుడు హను రాఘవపూడి హీరోయిన్ గా ప్రమోషన్ ఇచ్చాడు. తన పాత్రకు చక్కగా సెట్ అవుతుందని భావించి అందాల రాక్షసి చిత్రంలో ఆఫర్ ఇచ్చాడు. ఆయన అంచనాలకు రెండింతల బెటర్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది లావణ్య.

అందాల రాక్షసి చిత్రంలో లావణ్య నటన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ ఉండిపోతుంది. సినిమా కమర్షియల్ గా పర్లేదు అనిపించుకుంది. లావణ్యకు మాత్రం మంచి ఫేమ్ వచ్చింది. మంచి నటిగా నిరూపించుకున్న లావణ్యకు టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వచ్చాయి. హోమ్లీ లుక్ కలిగిన లావణ్యకు ఆ తరహా, పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ దక్కాయి. సక్సెస్ రేట్ లేని లావణ్య రేసులో వెనుకబడింది.

మంచు విష్ణుకు జంటగా చేసిన సెకండ్ మూవీ దూసుకెళ్తా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. భలే భలే మగాడివోయ్ మూవీతో సూపర్ హిట్ కొట్టింది. నాని హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన భలే భలే మగాడివోయ్ మంచి విజయాన్ని నమోదు చేసింది. లావణ్య ఇమేజ్ కి ఆ చిత్రం ప్లస్ అయ్యింది. ఆ వెంటనే సోగ్గాడే చిన్నినాయనా మూవీతో మరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది.

అయితే సోగ్గాడే చిన్నినాయనా చిత్రం తర్వాత ఆమెకు వరుస ప్లాప్స్ పడ్డాయి. దీంతో గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. 2021లో చేసిన ‘ఏవన్ ఎక్స్ ప్రెస్’, చావు కబురు చల్లగా డిజాస్టర్స్ అయ్యాయి. ఇక గత ఏడాది హ్యాపీ బర్త్ డే టైటిల్ తో ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చేశారు. అది కూడా ఆమెను నిరాశపరిచింది. ప్రస్తుతం ఆమె ‘పులి మేక’ టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇది జీ 5లో స్ట్రీమ్ కానుంది.
ఈ మధ్య గ్లామరస్ ఫోటో షూట్స్ కూడా చేయడం లేదు. చాలా రోజులు తర్వాత చోళీ లెహంగాలో మెస్మరైజింగ్ ఫోటో షూట్ చేసింది. దీంతో సోషల్ మీడియా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా హీరో వరుణ్ తేజ్ తో లావణ్య ఎఫైర్ నడిపారన్న పుకార్లు ఉన్నాయి. ఆ మధ్య పెళ్ళికి సిద్దమయ్యారంటూ వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ ని లావణ్య ఖండించారు.