Guntur Karam Song : మహేష్ బాబు గుంటూరు కారం పై ఫ్యాన్స్ లో సందేహాలు ఉన్నాయి. ఆగుతూ సాగుతూ పడుతూ లేస్తూ ఈ సినిమా షూటింగ్ సాగింది. ముందుగా అనుకున్న నటులు, సాంకేతిక నిపుణులు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. దీంతో గుంటూరు కారం అవుట్ ఫుట్ పై సందేహాలు ఉన్నాయి. దానికి తోడు సెకండ్ సింగిల్ ‘ఓహ్ బేబీ’ ఆకట్టుకోలేదు. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విమర్శలు చేయగా, లిరిక్స్ ఇచ్చిన రామజోగయ్య శాస్త్రి ఫైర్ అయ్యారు.
అయితే మూడో పాటతో ఆ నెగిటివిటీ మొత్తం దూరం చేశాడు త్రివిక్రమ్. మూడో సాంగ్ ‘కుర్చీ మడతపెట్టి’ ప్రోమో విడుదల చేశారు. మహేష్ బాబు-శ్రీలీల లుక్స్, స్టెప్స్.. మాస్ కాదు ఊర మాస్ గా ఉన్నాయి. మహేష్ బాడీ లాంగ్వేజ్ డబుల్ మీనింగ్ తో దారుణంగా ఉంది. మహేష్ అలాంటి గెస్చర్ కి ఊపుకోవడం ఊహించని పరిణామం.
మహేష్ క్యారెక్టర్ ఈ మూవీలో ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతుంది ఈ పాట. మహేష్ బాబు కెరీర్లో అవుట్ అండ్ అవుట్ ఊరమాస్ రోల్ చేసింది లేదు. తనకు అంతగా సెట్ కావని మహేష్ భావిస్తారు. త్రివిక్రమ్ పై నమ్మకం ఉంచి మాస్ మేనరిజం, క్యారెక్టరైజేషన్ కి ఒప్పుకుని ఉంటారు. సోషల్ మీడియాలో పాప్యులర్ అయిన ఓ పెద్దాయన డైలాగే.. ఈ కుర్చీ మడతపెట్టి. ఆ పెద్దాయన తన బామ్మర్దులను కొట్టానని చెబుతూ వాడిన… ఆ డైలాగ్ పిచ్చ ఫేమస్.
ఆ పెద్దాయన కుర్చీ మడతపెట్టి డైలాగ్ తీసుకుని ఈ పాట లిరిక్స్ రాశారు. ఇక గుంటూరు కారం జనవరి 12న విడుదల కానుంది. షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. మహేష్ బాబు తన పార్ట్ పూర్తి కావడంతో దుబాయ్ వెళ్ళాడు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Hyping up your new year!! Here's the promo of #KurchiMadathapetti#TrivikramSrinivas @MusicThaman @sreeleela14 @Meenakshiioffl #RamajogayyaSastry @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash @haarikahassine @adityamusic #GunturKaaramOnJan12th pic.twitter.com/tP9HPN8TvA
— Mahesh Babu (@urstrulyMahesh) December 29, 2023