Bubble Gum Review: ప్రతివారం యూత్ ని ఆకర్షించే సినిమాలు చాలా వస్తున్నాయి, వెళ్తున్నాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రమే స్టాండర్డ్ గా నిలబడి ఒక భారీ సక్సెస్ సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే యాంకర్ సుమ కనకాల, యాక్టర్ రాజీవ్ కనకాల కొడుకు అయిన రోషన్ కనకాల హీరోగా పరిచయమవుతూ బబుల్ గమ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఇక రోషన్ కనకాల ఈ సినిమాతో సక్సెస్ సాధించాడా లేదా రోషన్ హీరో గా పనికి వస్తాడా లేదా అనేది మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం…
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే రోషన్ కనకాల పని పాట లేకుండా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ గడిపే ఒక కుర్రాడు. ఆయన మానస చౌదరి ని ప్రేమిస్తాడు అలా మనస తో ప్రేమగా తిరుగుతూ ఉంటాడు.అలా చాలా రోజుల పాటు ప్రేమగా తిరుగుతుంటే మధ్యలో ఇంకో వ్యక్తి వచ్చి వీళ్ళ ప్రేమకి అడ్డుపడుతూ ఉంటాడు. దాంతో ఒకానొక సందర్భంలో రోషన్ కనకాల ఇమేజ్ ని డామేజ్ చేస్తాడు. దాంతో పోయిన ఇమేజ్ ని మళ్ళీ కాపాడుకోవాలంటే మనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని సంపాదించుకోవాలి అనే ఉద్దేశ్యం తో కథ సాగుతుంది. అయితే తను అనుకున్నట్టుగానే తన లక్ష్యాన్ని తను చేరుకున్నాడా తను ప్రేమించిన మానస చౌదరిని పెళ్లి చేసుకున్నాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
ఇక ఈ సినిమా దర్శకుడు అయిన రవికాంత్ ఈ సినిమాని చాలా ఎక్సైటింగ్ గా తెరకెక్కించాడు. ముఖ్యంగా ప్రతి సీన్ లో ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని చాలా బాగా సస్టైన్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాడు. ముఖ్యంగా ఆయన క్షణం ,రామ్ అండ్ హిస్ లీల సినిమా లతో మంచి పేరును సంపాదించుకున్నాడు అలాగే ఈ సినిమాని బ్యూటిఫుల్ గా మలచడంలో రవికాంత్ 100% సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అర్జున్ రెడ్డి ఫ్లేవర్ తో ఈ సినిమాని నడిపించిన రవికాంత్ ఈ సినిమాని సక్సెస్ చేయడానికి తన వంతు కృషి అయితే చేశాడు. ముఖ్యంగా యూత్ ని టార్గెట్ చేసి చేసిన ఈ సినిమాలో కొన్ని సీన్లకు మాత్రం యూత్ విజిల్స్ వేయడం పక్కా అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అలాగే రోషన్ కనకాల కూడా ఆ క్యారెక్టర్ కి చాలా బాగా ఆప్ట్ అయ్యాడు… సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు కొంతవరకు లాగ్ గా అనిపించినప్పటికీ సినిమా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది కాబట్టి అది పెద్దగా గుర్తించాల్సిన విషయం అయితే కాదు అనేది తెలుస్తుంది. అలాగే క్లైమాక్స్ ని చాలా తొందరగా ముగించినట్టుగా అనిపించింది. క్లైమాక్స్ లో ఇచ్చిన జస్టిఫికేషన్ బాగానే ఉన్నప్పటికీ దానిని ఇంకా కొంచం ఎక్స్టెండ్ చేసి ఉంటే బాగుండేది అలాగే ఈ సినిమాలో ఉన్న కొన్ని ట్విస్టులు కూడా సినిమాకి హైలైట్ గా అనిపించినప్పటికీ అవి సందర్భనుసారం గా రాలేదని అనిపిస్తుంది.
ఇక ఆర్టిస్ట్ లా పర్ఫామెన్స్ విషయానికి వస్తే రోషన్ కనకాల ఆ క్యారెక్టర్ ని బాగా ఓన్ చేసుకుని చాలా సేటిల్డ్ గా పర్ఫార్మ్ చేశాడు. ముఖ్యంగా ఒక యూత్ కుర్రాడికి ఏమైతే కావాలో ఆయన తన డ్రీమ్స్ కోసం ఎలా అయితే పోరాటం చేస్తాడో వాటిని స్పష్టంగా తెరపైన చూపించగలిగాడు. ముఖ్యంగా రోషన్ ఫస్ట్ సినిమా ఆర్టిస్ట్ అయినప్పటికీ తను అంత మెచ్యూర్డ్ పర్ఫామెన్స్ ఇవ్వడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. వాళ్ళ అమ్మ నాన్న కూడా మంచి నటులు అవ్వడమే దానికి రీజన్ అయి ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. ఇక హీరోయిన్ గా చేసిన మానస చౌదరి కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. మిగితా ఆర్టిస్టులు కూడా తమదైన రీతిలో మంచి పర్ఫామెన్స్ ని ఇచ్చారు. ముఖ్యంగా వైవా హర్ష కూడా తనదైన రీతిలో సెటిల్డ్ పర్ఫామెన్స్ ని ఇవ్వటమే కాకుండా సినిమాలో మంచి కామెడీ ని కూడా పంచాడు.
ఇక ఈ సినిమా టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన శ్రీ చరణ్ పాకాల తనదైన రీతిలో చాలా మంచి మ్యూజిక్ ని అందించారు.కొన్ని సీన్లు ఎలివేట్ అవ్వడానికి ఆయన అందించిన మ్యూజిక్ కూడా చాలా బాగా హెల్ప్ అయింది…ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటూనే మనల్ని సినిమాలో ఇన్వాల్వ్ చేస్తుంది.ఈ సినిమా కి రవికాంత్ డైరెక్షన్ గాని , స్టోరీ గాని, స్క్రీన్ ప్లే గాని చాలా బాగా హెల్ప్ అయింది…
ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే
కథ, డైరెక్షన్ ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యాయి
రోషన్ యాక్టింగ్ కూడా బాగుంది.
కొన్ని ఎలివేషన్ సీన్స్ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయ్యాయి…
ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే…
కొన్ని సీన్స్ లాగ్ అయ్యాయి అలాగే ఫస్ట్ ఆఫ్ కొంచెం బోరింగ్ గా అనిపించింది…
క్లైమాక్స్ కూడా తొందరగా ముగిసినట్టుగా అనిపించింది. దాంతో అది కొంతవరకు మైనస్ అయింది…
ఇక ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2.75/5