https://oktelugu.com/

Superstar Krishna Last rites : కృష్ణ భౌతికకాయం తరలింపు.. అంత్యక్రియలు ఎక్కడంటే?

Superstar Krishna Last rites : సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయన్ని నిన్ననే గచ్చిబౌలి స్టేడియానికి తీసుకెళ్లి అభిమానుల సందర్శనార్థం ఉంచాలని అందరూ భావించారు. కానీ ఇంతటి చలిలో కుటుంబ సభ్యులు, ఇతరులకు ఇబ్బంది అని తెలిసి రాత్రికి కృష్ణ నివాసంలోనే ఉంచారు. ఈ ఉదయం కృష్ణ భౌతిక ఖాయాన్ని నానక్ రామ్ గూడలోని నివాసం నుంచి పద్మాలయ స్టూడియోకు తరలించారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ అభిమానుల సందర్శనార్థం పార్థీవ దేహాన్ని అక్కడే ఉంచనున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2022 / 08:50 AM IST
    Follow us on

    Superstar Krishna Last rites : సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయన్ని నిన్ననే గచ్చిబౌలి స్టేడియానికి తీసుకెళ్లి అభిమానుల సందర్శనార్థం ఉంచాలని అందరూ భావించారు. కానీ ఇంతటి చలిలో కుటుంబ సభ్యులు, ఇతరులకు ఇబ్బంది అని తెలిసి రాత్రికి కృష్ణ నివాసంలోనే ఉంచారు. ఈ ఉదయం కృష్ణ భౌతిక ఖాయాన్ని నానక్ రామ్ గూడలోని నివాసం నుంచి పద్మాలయ స్టూడియోకు తరలించారు.

    మధ్యాహ్నం 12 గంటల వరకూ అభిమానుల సందర్శనార్థం పార్థీవ దేహాన్ని అక్కడే ఉంచనున్నారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లీహిల్స్ మహా ప్రస్థానానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి.

    కాగా కృష్ణ అంత్యక్రియలను పద్మాలయ స్టూడియో కానీ.. లేదంటే ఆయన ఫాంహౌస్ లో కానీ చేస్తారని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత కృష్ణ స్మారకాన్ని నిర్మిస్తారని భావించారు. ఎందుకంటే ఇటీవల మరణించిన కృష్ణంరాజు మృతదేహాన్ని కూడా ఇలాగే ఆయన ఫాంహౌస్ లో అంత్యక్రియలు నిర్వహించి అక్కడే స్మారకం ఏర్పాటు చేశారు. కృష్ణకు అలా చేస్తారని అనుకున్నా సాధ్య పడలేదు.

    కృష్ణ అంత్యక్రియలను జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానం శ్మశాన వాటికలోనే చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి. ఇక్కడే మహేష్ తల్లి అంత్యక్రియలు కూడా జరిగాయి. ఇప్పుడు తండ్రివి కూడా ఇక్కడే చేస్తుండడం గమనార్హం.