https://oktelugu.com/

Himanshu : నాన్నకు ప్రేమతో.. పాట పాడిన కొడుకు హిమాన్షు.. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన తండ్రి కేటీఆర్‌!

తెలంగాణ ఉద్యమకాలంలో అమెరికాలో ఉన్న కేటీఆర్‌ ఉద్యమం పీక్‌ స్టేజీకి వచ్చాక ఇండియాకు వచ్చారు. సిరిసిల్ల నుంచి పోటీచేసి కేవలం 131 ఓట్లతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఐదు సార్లు గెలిచారు. రెండు పర్యాయాలు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 29, 2024 / 01:11 PM IST

    Himanshu Rao Song

    Follow us on

    Himanshu : తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌ పాత్ర ఎవరూ కాదనలేనిది. ఆ పార్టీ లేకుంటే.. కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమం తలపెట్టకుంటే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించేది కాదు. అయితే ఉద్యమ సమయంలో నా పిల్లలు అమెరికాలో సెటిల్‌ అయ్యారు. నాకు, నా ముసల్దానికి వేరే పనేమీ లేదు. తెలంగాణ సాధన కోసమే ఉద్యమం చేపట్టా అని ప్రకటించారు. కానీ, ఉద్యమం చివరి అంకానికి చేరిన తర్వాత, తెలంగాణ రావడం కాయం అయిన తర్వాత తన కొడుకు కేటీఆర్, కూతురు కవితను తెలంగాణకు రప్పించారు. కవిత జాగృతి పేరుతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కేటీఆర్‌ తుది దశ ఉద్యమంలో పాల్గొన్నారు.

    ఎవరి కుటంబం వారిదే..
    కేసీఆర్, కేటీఆర్, కవిత, తండ్రి, కొడుకు, కూతురు అయినా.. ఎవరి కుటుంబం వారిదే. కేటీఆర్‌కు భార్య శైలిమ, కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు హిమాన్షు అంటే కేసీఆర్‌కు అత్యంత ప్రేమ. ప్రతీ కార్యంలో హిమాన్షు కేసీఆర్‌తో ఉండేవారు. తాతామీద ప్రేమతో 2023 ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారం పాటలు రూపొందించారు. సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ చేశారు. కానీ, అవి ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఇక హిమాన్షు గత జూలైలో తన తండ్రి కేటీఆర్‌ కోసం పాట పాడారు. కేటీఆర్‌ పుట్టిన రోజున దానిని వినిపించాలని, రిలీజ్‌ చేయాలని భావించాడు. కానీ, రికార్డింగ్‌ సరిగా రాకపోవడంతో ఎవరికీ తెలుపలేదు.

    ఎక్స్‌లో షేర్‌ చేసిన కేటీఆర్‌..
    అయితే కేటీఆర్‌ ఆ పాటను ఇటీవలే విన్నారు. దానిని ఎక్స్‌లో తాజాగా షేర్‌ చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా యానిమల్‌ సినిమాలోని నా ‘సూర్యుడివి.. నా చంద్రుడివి’ అనే పాట పాడినట్లు పేర్కొన్నారు. తండ్రితో తనకున్న జ్ఞాపకాల ఫొటోలను యాడ్‌ చేసి వీడియో రూపొందించారు. తన కోసం కొడుకు పాట పాడిన విషయం తెలుసుకున్న కేటీఆర్ సంబరపడిపోయారు. సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. తన కొడుకు పాట విని తనకు గర్వంగా సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశారు.

    స్పందిస్తున్న నెటిజన్లు…
    సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్‌ ఏది పోస్టు చేసినా ఫాలోవర్స్‌ వెంటనే స్పందిస్తారు. తాజాగా తన కొడుకు రాసిన పాటను పోస్టు చేయడంతో నెటిజన్లు ఆ పాట విని కామెంట్స్‌ చేస్తున్నారు. తండ్రికి తనయుడు ఇచ్చిన పెద్ద గిఫ్ట్‌ అని చాలా మంది కామెంట్లు పెట్టారు. హిమాన్షు సాహిత్యం, గానం అద్భుంతంగా ఉందని చాలా మంది ప్రశంసించారు. కష్టతరమైన సంవత్సరంలో తనకు ఈ పాటను అందించిన హిమాన్షుక అభినందనలు అని కేటీఆర్‌ కూడా పోస్టు పెట్టారు. తనను మెచ్చుకోవడం హ్యాపీగా ఉందని హిమాన్షు కూడా రీట్వీట్‌ చేశారు.