Mohammed Siraj : మెల్ బోర్న్ మైదానంలో ఆదివారం నాడు అటువంటి ఘటన చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ చేసిన పనికి మహమ్మద్ సిరాజ్ కు జీవనకాల సాఫల్య పురస్కారం లభించినంత గౌరవం దక్కింది. బుమ్రా దూకుడు వల్ల అప్పటికే ఆస్ట్రేలియా 91 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లబూ షేన్(70), కమిన్స్(41) ఏడో వికెట్ కు 57 పరుగులు జోడించారు. అత్యంత ప్రమాదకరంగా మారుతున్నారు. అయితే ఈ జోడిని విడగొట్టడానికి కెప్టెన్ రోహిత్ శర్మ మహమ్మద్ సిరాజ్ ను రంగంలోకి దింపాడు. 55వ ఓవర్ లో బౌలింగ్ లోకి దిగిన మహమ్మద్ సిరాజ్.. తను వేసిన తొలి బంతికే లబూషేన్ ను బోల్తా కొట్టించాడు. సిరాజ్ వేసిన షార్ట్ పిచ్ బంతి లబూషేన్ ప్యాడ్ ను తాకింది. ఫీల్డ్ ఎంపైర్ కు అప్పీల్ చేయగా.. అతడు వెంటనే ఔట్ ఇచ్చాడు. దీంతో మైదానంలో సంబరాలు మొదలయ్యాయి. కీలక సమయంలో వికెట్ పడగొట్టిన మహమ్మద్ సిరాజ్ ను టీమిండి ఆటగాళ్లు అభినందించారు.
ప్రేక్షకులతో జత కలిశాడు
ఎంతో విలువైన వికెట్ తీయడంతో మహమ్మద్ సిరాజ్ ను విరాట్ కోహ్లీ ప్రత్యేకంగా అభినందించాడు. విరాట్ కోహ్లీ తన ఫీల్డింగ్ పొజిషన్లోకి వెళ్ళగా.. మైదానంలో ఉన్న అభిమానులు కోహ్లీ.. కోహ్లీ అని అరవడం మొదలుపెట్టారు.. ” వికెట్ తీసింది నేను కాదు.. మహమ్మద్ సిరాజ్.. అతడిని అభినందించండి.. డీఎస్పీ డీఎస్పీ అని ఉత్సాహపరచండి” అని కోహ్లీ ప్రేక్షకులకు సంకేతాలు ఇచ్చాడు. దీంతో వారు డీఎస్పీ డీఎస్పీ డీఎస్పీ అంటూ అరవడం మొదలుపెట్టారు. వారిని ఉత్సాహపరిచేందుకు విరాట్ కోహ్లీ కూడా డీఎస్పీ డీఎస్పీ అనేలాగా చేతులతో సైగలు చేశాడు. దీంతో మైదానం మొత్తం హోరెత్తిపోయింది. హెడ్ తో నెలకొన్న వివాదం పద్యంలో.. సిరాజ్ పై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగాయి. ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అంటూ కొంతమంది అతడిని ట్రోల్ చేశారు.. కానీ మెల్బోర్న్ మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో ఆస్ట్రేలియా రెండవ కీలకమైన లబూ షేన్ క్రికెట్ పడగొట్టడం ద్వారా సిరాజ్ తనపై ఉన్న నెగిటివిటీని మొత్తం కూడా పటా పంచలు చేసుకున్నాడు. మొత్తంగా సోషల్ మీడియాలో అభినందనలు అందుకుంటున్నాడు.. సాక్షాత్తు విరాట్ కోహ్లీ ప్రేక్షకులతో జతకలిసి సిరాజ్ ను అభినందనలతో ముంచెత్తాలా చేశాడు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినంత గొప్పగా అతడిని అభినందించేలా చేశాడు.. మహమ్మద్ సిరాజ్ గొప్పగా చెప్పుకునే జ్ఞాపకాన్ని అందించాడు.
Virat Kohli asking the crowd to cheer for Siraj
– The man, King at MCG. pic.twitter.com/iF8fUembl1
— Johns. (@CricCrazyJohns) December 29, 2024