
KTR And Harish On Delhi: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ చాలా వేగంగా అడుగులు వేస్తోంది.. ఇప్పటికే ఈ కుంభకోణంలో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న సౌత్ గ్రూప్ కు చెందిన పలువురిని అరెస్టు చేసింది. వారిలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా ఉన్నారు. అయితే ఈ గ్రూపులో ఎమ్మెల్సీ కవిత కీలకంగా ఉన్నారని, ఆమె ఈ కుంభకోణానికి పాల్పడ్డారని పేర్కొంటూ ఈడి ఆమెను శనివారం విచారించనుంది.. ఉదయం 11 గంటలకు ఆమె ఈ డి అధికారుల ఎదుట హాజరుకానున్నారు. ఇప్పటివరకు అరెస్టు అయిన వారందరి విషయంలోనూ ఈడి ఇదే విధానాన్ని అనుసరించింది. ఆమధ్య కవితను హైదరాబాదులోని తన నివాసంలో విచారించిన అధికారులు… ఈసారి ఏకంగా ఢిల్లీ పిలిపించారు.. ఈ నేపథ్యంలో మహా అయితే కవితను అరెస్టు చేస్తారంటూ కేసిఆర్ నోట వినిపించింది.. కానీ ఆ తర్వాతే సీన్ పూర్తిగా మారిపోయింది.
కవిత ఢిల్లీలో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలంటూ నిరసన చేపట్టారు.. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి ఇద్దరు మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ వెళ్లారు.. అయితే కవిత అరెస్టు తప్పదేమోనన్న కారణంతోనే వారు ఢిల్లీ వెళ్ళినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.. వీరిద్దరూ ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో కవిత అరెస్టు ఉండకపోవచ్చు అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి ఇప్పటివరకు సౌత్ గ్రూపుకు చెందిన పలువురిని విచారణ పేరుతో ఢిల్లీ పిలిపించిన ఈ డి అధికారులు,వారు విచారణకు సహకరించడం లేదని అభియోగంతోనే అరెస్టు చేసింది. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లిన క్రమంలో కవిత అరెస్టు ఉండదని భారత రాష్ట్ర సమితి నాయకులు అంటున్నారు. కేటీఆర్, హరీష్ ఢిల్లీ వెళ్లినంతమాత్రాన కవితను అరెస్ట్ చేయకుండా ఉండరని బిజెపి వర్గాలు అంటున్నాయి.

మరోవైపు తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని కవిత చెబుతున్నారు.. ఒకవేళ విచారణకు ఆమె సహకరించిన నేపథ్యంలో ఈ డి అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. ఒకవేళ అరెస్టు చేస్తే ఎందువల్ల ఆ పని చేయాల్సి వచ్చిందో ఈడి కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది.. అయితే కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్ సూచనల మేరకే ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది.. కెసిఆర్ తెర వెనుక ఏమైనా మంత్రాంగం నడిపారా? అందుకే వారిని ఢిల్లీ పంపారా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. ఏది ఏమైనప్పటికీ కవిత భవితవ్యం ఏమిటో తెలియదు. కెసిఆర్ ఏమైనా బిజెపి ప్రజలతో సంధీ ప్రయత్నం కుదుర్చుకున్నారా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఎందుకంటే తన అవసరాల కోసం కేసీఆర్ దేనికోసమేనా తెగిస్తారు. గతంలో జరిగిన పరిణామాలు వీటినే రూడీ చేస్తున్నాయి. ఓవైపు దేశంలో చక్రం తిప్పాలని అనుకుంటున్న కేసీఆర్ కు కవిత రూపంలో ఇబ్బంది ఎదురైతే రాజకీయ మనగడే ప్రశ్నార్థకంగా మారుతుంది.. అలాంటప్పుడు కవిత ను అరెస్టు కాకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.. అయితే మీడియాను డైవర్ట్ చేసేందుకే నిన్న కవితను మహా అయితే అరెస్టు చేస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.