Kriti Sanon- Prabhas: ఒక ప్రక్క ప్రేమను ఖండిస్తూనే మరో ప్రక్క అనుమానాస్పద వ్యాఖ్యలు చేస్తుంది కృతి సనన్. ఆదిపురుష్ మూవీ సెట్స్ లో ఒకరికొకరం ఇచ్చిపుచ్చుకున్నామని కృతి చెప్పడం ఆసక్తి రేపుతోంది. ఇటీవల ప్రభాస్-కృతి సనన్ ప్రేమ పుకార్లు తెరపైకి వచ్చాయి. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్… పరోక్షంగా ప్రభాస్ మనసులో కృతి సనన్ ఉందని హింట్ ఇచ్చాడు. అలాగే వివాదాస్పద ఫిల్మ్ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు ట్వీట్ మరింత కాకరేపింది. ఆదిపురుష్ సెట్స్ లో ప్రభాస్ హీరోయిన్ కృతి సనన్ కి ప్రపోజ్ చేశాడు. త్వరలో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ జరుపుకొన్నారని ట్వీట్ చేశాడు.

ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ బుర్ర గోక్కున్నారు. ఈ రూమర్స్ కి కృతి చెక్ పెట్టారు. మా మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు. ప్రభాస్ నాకు మంచి మిత్రుడు మాత్రమే. ప్రభాస్, నేను లవ్ లో ఉన్నామని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అయితే ఆమె తాజా కామెంట్స్ మళ్ళీ పుకార్లకు ఊతం ఇస్తున్నాయి.
ప్రభాస్ గొప్ప హ్యూమన్ బీయింగ్. సెట్స్ లో ఆయన అందరితో బాగా కలిసిపోతారు. ఆదిపురుష్ సెట్స్ లో ప్రభాస్ నాకు తెలుగు నేర్పారు. ఆయన కారణంగానే నేను తెలుగు ఇంత బాగా మాట్లాడగలుతున్నాను. దానికి ప్రతిగా నేను ప్రభాస్ కి హిందీ నేర్పాను. ఆదిపురుష్ సెట్స్ లో ఆ విధంగా మేము ఒకరికొకరం ఇచ్చిపుచ్చుకున్నాము. నాకు తెలుగు నేర్పినందుకు ప్రభాస్ కి థాంక్స్ చెప్పాలి. ఇక వివిధ రకాల వంటకాలతో ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం జీవితంలో మర్చిపోలేను. ప్రభాస్ ఉంటే ఫుడ్ కి కొరత ఉందని కృతి సనన్ ప్రభాస్ పై తనకున్న అమితమైన అభిమానాన్ని బయటపెట్టారు.

కాగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. 2023 జనవరిలో ఆదిపురుష్ విడుదల కావాల్సి ఉంది. ఆదిపురుష్ టీజర్ విమర్శలపాలైన నేపథ్యంలో సినిమాకు మెరుగుదిద్దుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రామునిగా, కృతి సనన్ జానకిగా నటిస్తున్నారు. ఇక కృతి సనన్ లేటెస్ట్ కామెంట్స్ ప్రభాస్ తో ఎఫైర్ రూమర్స్ కి కారణమయ్యాయి.