Krithi Shetty: దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో కొనసాగుతున్నప్పటికీ స్టార్ స్టేటస్ దక్కించుకోలేక కెరీర్ ని మధ్యలోనే ఆపేసిన హీరోయిన్లు మన సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎంతోమంది ఉన్నారు..అలాంటి పోటీ వాతావరణం ఉన్న ఈరోజుల్లో యూత్ లో క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం ఒక్క సినిమా ద్వారానే రప్పించుకోవడం చాలా కష్టం..అలా రావాలంటే టాలెంట్ , అందం తో పాటు బోలెడంత అదృష్టం కూడా ఉండాలి..అది చాలా తక్కువ మందికి మాత్రమే దక్కుతుంది..ఆ తక్కువమంది లో ఒకరే కృతి శెట్టి.

ఉప్పెన సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈమె, తొలి సినిమాతోనే తన అందం మరియు నటనతో యూత్ మనసులను దోచేసుకుంది..ఈమె క్రేజ్ చూస్తే ఎవరైనా మెంటలెక్కిపోవాల్సిందే..అలాంటి స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న ఈ బ్యూటీ కెరీర్ ప్రస్తుతం ప్రమాదం లో పడింది..ఉప్పెన తర్వాత ఈ అమ్మాయి చేసిన శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు చిత్రాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.
కానీ ఆ సినిమాల తర్వాత ఆమె చేసిన మాచెర్ల నియోజకవర్గం, ది వారియర్ మరియు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయాలు సాధించాయి..దీనితో ఆమె కెరీర్ ఇప్పుడు రిస్క్ లో పడింది..కుర్ర హీరోలు తప్ప స్టార్ హీరోలెవ్వరు కూడా ఈమె వైపు చూడడం లేదు..దానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి..ఒకటి ఆమె వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉండడం..రెండు ఆమె వయస్సు..కృతి శెట్టి వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే.

స్టార్ హీరోలందరూ 40 ఏళ్లకు దగ్గర్లో ఉన్నారు..వాళ్ళ పక్కన ఈ అమ్మాయి హీరోయిన్ అంటే చాలా చిన్నపిల్లలాగా కనిపిస్తుంది..కానీ ఒక హీరోయిన్ కెరీర్ వేరే లెవెల్ కి వెళ్ళాలి అంటే స్టార్ హీరోతో సినిమా కచ్చితంగా చెయ్యాలి..అందుకే కృతి శెట్టి ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత కొంతకాలం సినిమాలకు గుడ్ బాయ్ చెప్పాలనుకుంటుందట.
సరైన కథ వచ్చేంత వరుకు సైన్ చెయ్యకూడదని నిర్ణయించుకుందట..అందుకోసం ఎంత సమయమైనా ఖాళీగా ఉండడానికి సిద్ధం అని చెప్తుంది ఈ బ్యూటీ..ప్రస్తుతం ఈమె నాగ చైతన్య – వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమాతో పాటుగా తమిళం లో సూర్య తో ఒక సినిమా, అలాగే మలయాళం లో తొనివో థామస్ తో మరో సినిమా చేయనుంది.