Sarkaru Vaari Paata TRP Rating: ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని – లింగుస్వామి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ది వారియర్’ చిత్రం ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే..కానీ రామ్ కి యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండడం వల్ల ఈ సినిమాకి ఓపెనింగ్స్ అదిరిపోయాయి..క్లోసింగ్ కలెక్షన్స్ కూడా 23 కోట్ల రూపాయిల షేర్ వరుకు వసూలు చేసింది.

కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ 45 కోట్ల రూపాయలకు జరగడం తో భారీ నష్టాలను చవిచూసి డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది..కానీ దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ బ్లాక్ బస్టర్ అవ్వడం ఈ సినిమాకి పాజిటివ్ గా మారిన అంశాలలో ఒకటి..’బులెట్’ ,’విజిల్ విజిల్’ సాంగ్స్ యూత్ మరియు మాస్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేసింది..ఇది ఇలా ఉండగా ఇటీవలే ఈ సినిమాని స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ చెయ్యగా సూపర్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.
ఈ సినిమా టీఆర్ఫీ రేటింగ్స్ దాదాపుగా 9.85 వరుకు వచ్చాయంటే మాములు విషయం కాదు..ఎందుకంటే ఓటీటీ పుణ్యమా అని ఇటీవల కాలం లో సూపర్ హిట్ సినిమాలకే ఇంత టీఆర్ఫీ రేటింగ్స్ రావడం లేదు..ఉదాహరణకి మహేష్ బాబు లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ సర్కారు వారి పాట సినిమానే తీసుకుందాము..ఈ సినిమాని మొదటిసారి టెలికాస్ట్ చేసినప్పుడు కేవలం 9.34 రేటింగ్స్ మాత్రమే వచ్చాయి..మహేష్ బాబు వంటి స్టార్ హీరో కి ఇది తక్కువే..కానీ రామ్ లాంటి మీడియం రేంజ్ హీరో ఫ్లాప్ సినిమా మహేష్ సూపర్ హిట్ సినిమాని దాటేసింది అంటే పెద్ద విషయమే.

దీనిని బట్టి చూస్తే రామ్ కి ఫామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది అని అర్థం అవుతుంది..ఆయన గత చిత్రం ఇస్మార్ట్ శంకర్ మొదటి టెలికాస్ట్ లో దాదాపుగా 16 టీఆర్ఫీ రేటింగ్స్ ని సాధించింది..అది కాసేపు పక్కన పెడితే రామ్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో ఒక సినిమా చేస్తున్నాడు..హైదరాబాద్ లో ఈ సినిమాకి సంబంధించిన ఒక భారీ ఫైట్ సీన్ ని ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమాతో రామ్ స్టార్ హీరో లీగ్ లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాడు..మరి ఆయన కలని ఈ సినిమా నిజం చేస్తుందో లేదో చూడాలి.