
Krithi Shetty: ఒకే ఒక్క సినిమా తో టాలీవుడ్ లో అద్భుతమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు.అలాంటి హీరోయిన్స్ లో ఒకరు కృతి శెట్టి.సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా ఇండస్ట్రీ కి పరిచయం అవుతూ తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి, ఆ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో టాలీవుడ్ లో ఆమెకి వరుసగా ఆఫర్లు వచ్చాయి.
యూత్ లో కూడా ఈ అమ్మడు క్రేజ్ మామూలుగా పెరగలేదు.అలా రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న ఈ అమ్మడి కెరీర్ ప్రస్తుతం రిస్క్ లో పడిపోయింది.ఎందుకంటే రీసెంట్ గా ఈమె హీరోయిన్ గా చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.ఉప్పెన తర్వాత ఆమె న్యాచురల్ స్టార్ నాని తో చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.
ఆ తర్వాత అక్కినేని నాగార్జున – నాగచైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన ‘బంగార్రాజు’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ ని అందుకుంది.కానీ ఆ తర్వాత ఆమె నటించిన ‘మాచెర్ల నియోజక వర్గం’, ‘ది వారియర్’ మరియు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వంటి సినిమాలు ఘోరమైన డిజాస్టర్స్ గా నిలిచాయి.దీనితో ఈ అమ్మాయికి స్టార్ డైరెక్టర్స్ అవకాశాలు ఇవ్వడానికి భయపడుతున్నారు.పైగా కొత్త ‘శ్రీలీల’ అనే కొత్త హీరోయిన్ వరుస విజయాలతో దూసుకుపోతుండడం తో అందరి ద్రుష్టి ఆమె వైపుకు మరలింది.దీనితో కృతి శెట్టి ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.ప్రస్తుతం ఆమె తెలుగులో ఆమె చేతిలో ‘కస్టడీ’ అనే చిత్రం మాత్రమే ఉంది.నాగ చైతన్య హీరో గా నటించిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.మార్చి 12 వ తేదీన తెలుగు మరియు తమిళం బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా మీదనే కృతి శెట్టి కెరీర్ ఆధారపడి ఉన్నది.

విక్రమ్ ప్రభు దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమా పై అక్కినేని ఫ్యాన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా హిట్ అవ్వకపోతే ఇక కృతి శెట్టి కెరీర్ ముగిసినట్టే అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.ఒకవేళ ఈ సినిమా తర్వాత ఆమెకి అవకాశాలు రాకపోతే సినిమాలకు టాటా చెప్పేసి అమెరికా లో MS చదవడానికి బయలుదేరుతుందట.మరి ఆమె కెరీర్ రాబొయ్యే రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి.