Ram Charan On Oscar: ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని గర్వపడేలా చేస్తున్న సినిమా #RRR.దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ ని అన్ని ప్రాంతీయ బాషలలో షేక్ చేసింది.ముఖ్యంగా ఓటీటీ లో విడుదలైన తర్వాత ఈ సినిమా క్రేజ్ ప్రపంచం నలుమూలల వ్యాప్తి చెందింది.ఈ సినిమాకి దర్శకత్వం వహించిన రాజమౌళి కి , మరియు హీరోలు గా చేసిన రామ్ చరణ్ – ఎన్టీఆర్ కి పాన్ వరల్డ్ రేంజ్ స్టార్ స్టేటస్ ని తెచ్చిపెట్టింది ఈ చిత్రం.
ఇక రీసెంట్ గా ఈ సినిమాకి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్స్ అవార్డ్స్, మరియు HCA అవార్డ్స్ ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అంతర్జాతీయ అవార్డులు ఈ చిత్రాన్ని వరించాయి.ఇక ప్రపంచం లోనే అత్యుత్తమ అవార్డ్స్ అయినా ‘ఒస్కార్స్’ లో కూడా ఈ చిత్రం ‘బెస్ట్ ఒరిజినల్’ సాంగ్ కి గాను ‘నాటు నాటు’ నామినేషన్స్ కి ఎంపిక అయ్యింది.
మార్చి 12 వ తారీఖున లాస్ ఏంజిల్స్ లో జరగబోతున్న ఈ అవార్డ్స్ ఫంక్షన్ కి #RRR మూవీ టీం మొత్తం హాజరు కానుంది.’నాటు నాటు’ పాటకి అవార్డు వస్తుందో రాదో అనేది ఇప్పుడే చెప్పలేం కానీ,ఒస్కార్స్ అవార్డ్స్ వేదిక మీద మాత్రం రామ్ చరణ్ మరియు రాజమౌళి కి ప్రత్యేకమైన అవార్డ్స్ ని ఇవ్వబోతున్నారట.పూర్తి వివరాలు ఇంకా తెలియదు కానీ,ఇది మాత్రం దాదాపుగా ఖరారు అయ్యినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.#RRR చిత్రం ఓటీటీ లో విడుదలైనప్పటి నుండి రాజమౌళి కి హాలీవుడ్ ఆడియన్స్ నుండి ఎలాంటి ప్రశంసలు దక్కాయి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా అదే రేంజ్ లో దక్కాయి.హాలీవుడ్ దిగ్గజ దర్శకులలో ఒకరైన జేమ్స్ కెమరూన్ కూడా రామ్ చరణ్ నటనని మెచ్చుకున్నాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఆయన సినిమాతో ఆయన తన అద్భుతమైన నటన ద్వారా ఏ స్థాయికి తీసుకెళ్లాడో అనేది.
మరి ఇంతకీ ఏ క్యాటగిరీ ద్వారా రామ్ చరణ్ మరియు రాజమౌళి లకు ఆస్కార్ అవార్డ్స్ రాబోతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్..ఈమధ్యనే HCA అవార్డ్స్ లో 5 అవార్డ్స్ ని గెల్చుకున్న #RRR చిత్రం, ఆస్కార్ అవార్డ్స్ లో కూడా అదే రేంజ్ సత్తా చాటాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.కేవలం అభిమానులు మాత్రమే కాదు,ఇండియాలో ఉన్న ప్రతీ ఒక్కరు ఈ అవార్డు #RRR చిత్రానికి దక్కాలని ప్రార్థన చేస్తున్నారు.మరి వాళ్ళ ప్రార్థనలు సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే మార్చి 12 వ తారీకు వరకు వేచి చూడాల్సిందే.