
Star Hero: హీరోలకు డూప్స్ వాడటం ఎప్పటి నుండో నడుస్తున్న ట్రెండ్. ప్రమాదకరమైన స్టంట్స్, గుర్రపు స్వారీలు, కారు, మోటార్ బైక్ ఛేజ్లు డూపులతోనే కానిచ్చేస్తారు. సపరేట్ గా క్లోజప్ షాట్స్ సదరు హీరో మీద తీసి దూకడాలు, పల్టీలు కొట్టడాలు డూపుతో చేయిస్తారు. ముఖం స్పష్టంగా తెలియకుండా లాంగ్ షాట్స్ తీస్తారు. సినిమా అంటే జనాలకు తెలియని ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో అవన్నీ హీరోలే చేస్తున్నారని జనాలు భ్రమపడేవారు. కొంచెం పరిజ్ఞానం వచ్చాక సినిమాల్లో చూపించేవన్నీ నిజాలు కాదని, హీరోలకు బదులు డూప్స్ కూడా వాడతారని అవగాహన వచ్చింది.
జనరేషన్స్ మారే కొద్దీ హీరోల్లో మార్పులు వచ్చింది. సాంకేతిక, భద్రతా ప్రమాణాలు పెరిగిన నేపథ్యంలో కొన్ని రిస్కీ స్టంట్స్ హీరోలే స్వయంగా చేస్తున్నారు. రోప్స్ సహాయంతో దూకుతూ, పల్టీలు కొడుతున్నారు. ఆ క్రమంలో చిన్న చిన్న ప్రమాదాల బారిన పడుతున్నారు. హీరో విశాల్ దాదాపు డూప్ లేకుండా నటిస్తారు. ఆయన పలుమార్లు గాయాలపాలయ్యారు. ఆయన్ని సెట్స్ నుండి ఆసుపత్రికి తరలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల అతిపెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు. హెవీ ట్రక్ ఆయన మీదకు దూసుకు వచ్చేసింది. తృటిలో ప్రాణాపాయం నుండి తప్పుకున్నాడు.

కాగా ఒక టాప్ హీరో తన సినిమాలు డూప్స్ తో లాగించేస్తున్నాడట. దర్శకులు మెజారిటీ పోర్షన్ డూప్స్ మీద తెరకెక్కిస్తున్నారట. క్లోజప్ షాట్స్, రొమాంటిక్, ఎమోషనల్ సీన్స్ మినహాయించి ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సులకు డూప్స్ సహాయం తీసుకుంటున్నారట. దీని కోసం ఆహార్యంలో తనను పోలిన ఇద్దరు డూప్స్ ని ఆ హీరో సిద్ధం చేసుకున్నారట. నడక, బాడీ లాంగ్వేజ్ కూడా వారితో ప్రాక్టీస్ చేయిస్తున్నారట. వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈ హీరో వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యిందట.
భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు మీడియం బడ్జెట్ చిత్రాలు చేస్తున్న ఆ హీరో కంటే కూడా డూప్స్ సెట్స్ లో ఎక్కువగా కష్టపడుతున్నారట. ఆయన హ్యాపీగా గొడుకు క్రింద కూర్చుంటున్నాడట. లేదంటే కారవాన్ లో రెస్ట్ తీసుకుంటున్నారట. అరవై ఏళ్ళు పైబడిన హీరోలు కూడా రిస్క్ చేస్తుంటే ఈ టాప్ స్టార్ మాత్రం అసలు రిస్క్ చేసేది లేదంటున్నారట. మరి ఆయన అంతలా డూప్స్ మీద ఆధారపడటానికి కారణం ఏమిటో అర్థం కావడం లేదు. ఈ మేరకు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.