NTR30 : బ్రేకింగ్: జాలరిగా ఎన్టీఆర్, లేటెస్ట్ హిట్ ఫార్ములా… కొరటాల అలా సెట్ చేశాడా!

NTR30 : స్టార్ హీరోల సినిమాలకు కూడా లీకుల బాధ తప్పడం లేదు. సెట్స్ లో షూట్ చేస్తున్నా ఏదో ఒక విధంగా హీరోల లుక్స్ బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్స్ లో ఎన్టీఆర్ 30 షూటింగ్ జరుగుతుంది. ఎన్టీఆర్ మీద యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. కాగా ఎన్టీఆర్ లుక్ లీకైంది. ఆయన గెటప్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఊరమాస్ గెటప్ లో ఎన్టీఆర్ సరికొత్తగా కనిపించారు. అదే సమయంలో […]

Written By: NARESH, Updated On : April 13, 2023 8:17 pm
Follow us on

NTR30 : స్టార్ హీరోల సినిమాలకు కూడా లీకుల బాధ తప్పడం లేదు. సెట్స్ లో షూట్ చేస్తున్నా ఏదో ఒక విధంగా హీరోల లుక్స్ బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్స్ లో ఎన్టీఆర్ 30 షూటింగ్ జరుగుతుంది. ఎన్టీఆర్ మీద యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. కాగా ఎన్టీఆర్ లుక్ లీకైంది. ఆయన గెటప్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఊరమాస్ గెటప్ లో ఎన్టీఆర్ సరికొత్తగా కనిపించారు. అదే సమయంలో ఆయన లుక్ పలు అనుమానాలు దారితీసింది. ఆయన డ్రెస్ చూస్తే జాలరి గుర్తుకు వచ్చారు.

దర్శకుడు కొరటాల శివ ఇది సముద్ర తీర ప్రాంతంలో జరిగే కథ అని చెప్పారు. సముద్రంతో ముడిపడి ఉన్న కథ అని చెప్పిన క్రమంలో ఎన్టీఆర్ జాలరి పాత్ర చేస్తున్నారనిపిస్తుంది. సినిమాల్లో జాలరులను ఓ ప్రత్యేకమైన గెటప్స్ లో ప్రజెంట్ చేస్తారు. రంగు రంగుల చొక్కాలు, బటన్స్ విప్పేసి, లోపల కట్ బన్నీతో చూపిస్తారు. ఉప్పెన, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో వైష్ణవ్ తేజ్, చిరంజీవిలను డైరెక్టర్స్ అలానే చూపించారు. ఆ చిత్రాల్లో వారు జాలరులు పాత్రలు చేసిన సంగతి తెలిసిందే.

దర్శకుడు కొరటాల శివ మూవీ నుండి లీకైన పిక్ లో ఎన్టీఆర్ గెటప్ అలానే ఉంది. కలర్ ఫుల్ షర్ట్ ధరించి మాస్ గెటప్ లో జాలరిలా ఉన్నారు. కాలనీలో విలన్ తో గొడవపడుతున్నట్లుగా ఉంది. దర్శకుడు కొరటాల శివ కథపై ఇచ్చిన హింట్స్ లీకైన ఎన్టీఆర్ గెటప్ కంపేర్ చేసుకుంటే అంచనా కరెక్ట్ అనిపిస్తుంది. అధికారికంగా విడుదల చేసిన జాన్వీ కపూర్ లుక్ సైతం మిడిల్ క్లాస్ పల్లెటూరి అమ్మాయిలా ఉంది. కాబట్టి ఎన్టీఆర్ కొరటాల మూవీలో చేస్తుంది జాలరి పాత్రే అంటున్నారు.

ఇక షూటింగ్ మొదలు కాకుండానే ఎన్టీఆర్ 30 విడుదల తేదీ ప్రకటించారు. 2024 ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్ర బడ్జెట్ రూ. 300 కోట్లని సమాచారం. విదేశీ సాంకేతిక నిపుణులు చిత్రానికి పని చేస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ అనంతరం గోవాలో మరో షెడ్యూల్ ప్లాన్ చేశారు. విడుదలకు ఏడాది సమయం మాత్రమే ఉండగా షూటింగ్ నిరవధికంగా జరపనున్నారు. ఎన్టీఆర్ 30 చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.