NTR- Koratala Siva Movie: ఈ మధ్య స్టార్ హీరోల ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. అసలు ఎప్పుడు మొదలవుతాయో తెలియక ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ 30 పై పలు అనుమానాలు ఉన్నాయి. ఈ చిత్రంపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టిన నేపథ్యంలో సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడనే సందిగ్ధత కొనసాగుతుంది. ఎన్టీఆర్ 30 ఏడాది క్రితమే సెట్స్ పైకి వెళ్ళాల్సి వుంది. ఆర్ ఆర్ ఆర్-ఎన్టీఆర్ 30 చిత్రాలను తారక్ ఏక కాలంలో పూర్తి చేస్తారనే ప్రచారం జరిగింది. అది జరగలేదు.

స్క్రిప్ట్ పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేని ఎన్టీఆర్ కొరటాలకు మార్పులు సూచించారని ఒక వాదన వినిపించింది. ఒక దశలో ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయిందంటూ కథనాలు వెలువడ్డాయి. అసలు ఎన్టీఆర్-కొరటాల మూవీ ఉందా? లేదా? అని ఫ్యాన్స్ కి పిచ్చెక్కింది. ఆ సమయంలో కొరటాల కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వదిలారు. ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్స్ తో ప్రీ ప్రొడక్షన్ పనుల గురించి కొరటాల చర్చలు జరుపుతున్న ఫోటోలు బయటకు వచ్చాక క్లారిటీ వచ్చింది.
అలాగే ఎన్టీఆర్ 30కి మ్యూజిక్ అందిస్తున్న అనిరుధ్ తో కొరటాల మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొన్నారు. నెలలుగా ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఫ్యామిలీతో పాటు వన్ మంత్ లాంగ్ ట్రిప్ కోసం అమెరికా వెళ్లారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అమెరికాలోనే ఎన్టీఆర్ భార్య, పిల్లలతో జరుపుకోనున్నారు. కొరటాల మాత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉన్నాడు.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం 2023 జనవరిలో ఎన్టీఆర్ 30 పూజా కార్యక్రమాలు జరపనున్నారు. ఇక రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో మొదలవుతుందట. ఎన్టీఆర్ కి కూడా ఇతర మూవీ కమిట్మెంట్స్ ఏమీ లేవు కాబట్టి… లాంగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారట. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయనున్నారట. ఇక ఎన్టీఆర్ 30 మూవీ హీరోయిన్ ని నిర్ణయించలేదు. పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నా… ఎలాంటి అధికారిక ప్రకటన జరగలేదు. పాన్ ఇండియా చిత్రంగా భారీ ఎత్తున ఎన్టీఆర్ 30 నిర్మించనున్నారు. కొరటాల మూవీ అనంతరం ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మూవీ ఉంటుంది .