Homeట్రెండింగ్ న్యూస్Dr Vaishali Kidnap Case: మిస్టర్‌ టీ’ నవీన్‌ మామూలోడు కాదు.. వైశాలి కిడ్నాప్‌నకు పక్కా...

Dr Vaishali Kidnap Case: మిస్టర్‌ టీ’ నవీన్‌ మామూలోడు కాదు.. వైశాలి కిడ్నాప్‌నకు పక్కా స్కెచ్‌!

Dr Vaishali Kidnap Case: సంచలనంగా మారిన రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన డాక్టర్‌ వైశాలి కిడ్నాప్‌ స్టోరీలో ఇంట్రస్టింగ్‌ యాంగిల్‌ ఉంది. ఈ కిడ్నాప్‌ ఘటనలో కొంత లోతుగా వెళ్తే.. ‘మిస్టర్‌ టీ’ నవీన్‌రెడ్డి లవ్‌ స్టోరీ బయటకొచ్చింది. వీళ్లిద్దరి మధ్య గతంలో మంచి స్నేహం ఉండేదని.. అది కాస్తా పెళ్లి వరకు వెళ్లి సెడెన్‌గా ఆగిపోయిందన్న విషయాలు వెలుగుచూశాయి. స్నేహం ఎప్పుడు మొదలైంది.. ప్రేమ ఎప్పుడు పుట్టింది.. ఎంత కాలం నడిచింది.. ఎంత దూరం పరుగెత్తింది.. కిడ్నాప్‌కు ఎలా దారితీసింది.. అన్నది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. సినిమాకు ఏమాత్రం తగ్గకుండా మిస్టర్‌ నవీన్‌రెడ్డి స్టోరీ నడిచింది.

Dr Vaishali Kidnap Case
Dr Vaishali Kidnap Case

తనను ఇష్టపడి కాదన్నందుకే..
తను ఇష్టపడిన అమ్మాయి తనను కాదని వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమవుతోందన్న కోపంతో.. నవీన్‌ వైశాలి ఇంటిపై దాడిచేసి కిడ్నాప్‌ చేశాడు. పట్టపగలే.. అందరూ చూస్తుండగా.. సుమారు వంద మంది వచ్చి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసి.. ఓ అమ్మాయిని ఎత్తుకెళ్లడం.. అది కూడా ఓ యువ పారిశ్రామిక వేత్తగా పేరుపొందిన వ్యక్తి చేయటం సంచలనంగా మారింది.

ల్యాండ్‌ లీజుకు తీసుకుని.. నిఘా పెట్టి..
నవీన్, వైశాలి ఇద్దరిదీ ఒకే సమాజికవర్గం.. వైశాలి చదువు అయిపోవటంతో.. పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లు అనుకున్నారు. తెలిసినవాళ్లతో ఈ విషయం చెప్పారు. కాగా.. అదే సమయంలో నవీన్‌ ప్రస్తావన వచ్చింది. కాగా.. అప్పటికే నవీన్‌ వీళ్లకు ముఖ పరిచయం కూడా ఉంది. కోవిడ్‌ సమయంలో.. వైశాలి టెన్నిస్‌ ఆడేందుకు వెళ్లినప్పుడు.. నవీన్‌తో పరిచయం ఏర్పడింది. అలా వాళ్ల పరిచయం కాస్త స్నేహంగా మారింది. అప్పటికే ఇద్దరి మధ్య స్నేహం ఉండటంతో.. ఇక పెళ్లి ప్రస్తావన రాగా.. ఇద్దరి ఈడూజోడూ బాగుంటుందని, పిల్లాడు కూడా సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకోవటంతో.. పెద్దలు కూడా ఓ మాట అనేసుకున్నారు. దీంతో.. పిల్లలిద్దరూ దగ్గరయ్యారు. సినిమాలు, షికార్లు కూడా తిరిగారు. తర్వాత ఏమైందో కానీ.. పెళ్లికి వైశాలి ఇంట్లో నిరాకరించారు. దీంతో ఇద్దరు అప్‌సెట్‌ అయ్యారు. అయితే.. ఇంట్లో వాళ్లు సర్ధిచెప్పటంతో.. వైశాలి కూడా పెళ్లికి నో చెప్పింది. కానీ.. నవీన్‌ ఆ మాటను తీసుకోలేకపోయాడు. తనను ఎలాగైనా మళ్లీ ఇంప్రెస్‌ చేసే పనుల్లో నిమగ్నమయ్యాడు. సినిమాల్లోలా తన ప్రేమను తెలియజేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించాడు. ఇందుకోసం వైశాలి ఇంటి ముందున్న స్థలాన్ని లీజుకు తీసుకున్నాడు. తనను రోజూ చూసుకుని మురిసిపోవాలని.. గ్లాస్‌ హౌస్‌ నిర్మించుకున్నాడు. వైశాలి రోజువారీ షెడ్యూల్, వారి కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు. ఎటు వెళ్తున్నారు అని తెలుసుకునేందుకు ఒక టీం ఏర్పాటు చేశాడు. ఇదంతా గమనించిన వైశాలి కుటుంబసభ్యులు నవీన్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురి వెంట పడుతున్నాడని.. ఇబ్బందికి గురి చేస్తున్నాడని తెలిపారు. దీంతో.. పోలీసులు నిజమేనా అని అడిగగా.. అసలు విషయం చెప్పి పోలీసులను నవీన్‌ మేనేజ్‌ చేశాడు. ఇలా ఆరు నెలలుగా కిందామీదా పడుతున్నాడు.

Dr Vaishali Kidnap Case
Dr Vaishali Kidnap Case

మేజిస్ట్రేట్‌ ఎదుట స్టేట్‌మెంట్‌..
కొన్ని రోజులకు వైశాలిని కుటుంబసభ్యులు మేజిస్ట్రేట్‌ వద్దకు తీసుకెళ్లారు. నవీన్‌రెడ్డిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని స్టెట్మెంట్‌ ఇప్పించారు. ఈ పరిణామంతో నవీన్‌రెడ్డి వైశాలితోపాటు, ఆమె కుటుంబ సభ్యులపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో వైశాలికి మరో వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చారు. ఈ విషయం తెలుసుకున్న నవీన్‌ ఆగలేకపోయాడు. సినిమాల్లో చూపించినట్టుగా అమ్మాయి వాళ్లింటికి వెళ్లి గొడవ చేసి.. తీసుకొచ్చుకుని పెళ్లి చేసేసుకునే అంతా సెట్‌ అవుతుందనుకున్నాడు. అయితే.. ఇది సినిమా కాదు కదా.. సీన్‌ రివర్స్‌ అయ్యింది. తన ప్రేయసి ఏడుస్తుండటం చూసి.. ఆమె తండ్రితో మాట్లాడేందుకు పర్మిషన్‌∙ఇచ్చాడు. ఇంకేముంది.. ఇక్కడ కూడా పోలీసులు సినిమా ట్రిక్‌ ప్లే చేశారు. ఈసారి ఆ ట్రిక్‌ పనిచేసింది. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ట్రాక్‌ చేసి వాళ్లున్న చోటుని కనుక్కుని నవీన్‌రెడ్డిని పట్టేసుకున్నారు. డాక్టర్‌ వైశాలిని సురక్షితంగా ఇంటికి చేర్చారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular