https://oktelugu.com/

Kohli Dance: సమంత ‘ఊ అంటావా మావా’ పాటకు ఊగిపోయిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో

Kohli Dance: ఎప్పుడూ క్రికెట్ యేనా.? అప్పుడప్పుడు ఎంటర్ టైన్ మెంట్ వద్దా? మైదానంలో పరుగులు చేయలేకపోతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఎంజాయ్ లో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. తాజాగా ఆర్సీబీ తరుఫున ఆడుతూ వరుసగా విఫలమవుతూ విమర్శలు ఎదుర్కొంటున్న మన కోహ్లీ పార్టీలో మాత్రం రెచ్చిపోయి డ్యాన్సులు చేస్తూ రొచ్చు రొచ్చు చేస్తున్నాడు. కోహ్లీ కెరీర్ లోనే ఇది బ్యాడ్ టైం నడుస్తోంది. అటు టీమిండియా పగ్గాలు వదిలేసి.. ఇటు ఐపీఎల్ కెప్టెన్సీ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 28, 2022 / 05:15 PM IST
    Follow us on

    Kohli Dance: ఎప్పుడూ క్రికెట్ యేనా.? అప్పుడప్పుడు ఎంటర్ టైన్ మెంట్ వద్దా? మైదానంలో పరుగులు చేయలేకపోతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఎంజాయ్ లో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. తాజాగా ఆర్సీబీ తరుఫున ఆడుతూ వరుసగా విఫలమవుతూ విమర్శలు ఎదుర్కొంటున్న మన కోహ్లీ పార్టీలో మాత్రం రెచ్చిపోయి డ్యాన్సులు చేస్తూ రొచ్చు రొచ్చు చేస్తున్నాడు.

    Kohli Dance

    కోహ్లీ కెరీర్ లోనే ఇది బ్యాడ్ టైం నడుస్తోంది. అటు టీమిండియా పగ్గాలు వదిలేసి.. ఇటు ఐపీఎల్ కెప్టెన్సీ వదిలేశాక.. అసలు ఆటగాడిగా కూడా అతడు రాణించలేకపోతున్నాడు.

    Also Read: Ajay Devgn vs Sudeep: హిందీ భాష పై సూపర్ స్టార్లు మధ్య వార్ !

    ప్రస్తుతం ఐపీఎల్ లో బెంగళూరు జట్టు తరుఫున ఆడుతున్న కోహ్లీ ముంబైలోని ఓ హోటల్ లో పార్టీ చేసుకున్నారు. బుధవారం రాత్రి ఆ జట్టు ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ ఇచ్చిన తన వివాహ పార్టీలో కోహ్లీ డ్యాన్స్ తో ఇరగదీయడం విశేషం.

    మ్యాక్స్ వెల్ ఐపీఎల్ కు ముందు భారత సంతతికి చెందిన వినీ రామన్ తో ఆస్ట్రేలియా లో పెళ్లి చేసుకున్నాడు. ఆపై బెంగలూరు వచ్చి ఐపీఎల్ లో మ్యాక్స్ వెల్ ఆడుతున్నాడు.తన పెళ్లికి రాలేకపోయిన తన మిత్రుల కోసం నూతన దంపతులు బుధవారం రాత్రి బెంగళూరులో ఆటగాళ్లకు పార్టీ ఇచ్చారు.

    Kohli Dance

    ఇందులో కెప్టెన్ డూప్లెసిస్ దంపతులతోపాటు.. విరాట్ కోహ్లీ దంపతులు కూడా పాల్గొన్నారు. ఇతర ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వీరంతా సంప్రదాయ దుస్తులు ధరించి ఈ పార్టీలో చిందులు వేశారు.

    ఇక కోహ్లీ అయితే పుష్పలోని ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా’ పాటకు అదిరిపోయేలా స్టెప్పులు వేసి అలరించారు.ఆటలో విఫలమవుతున్న కోహ్లీ ఇలా బయట మాత్రం డ్యాన్సులతో సేదతీరుతూ కాస్తా రిలాక్స్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. కోహ్లీ డ్యాన్సింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    Also Read: Nikhil: షాకింగ్ : క్రేజీ హీరో తండ్రి కన్నుమూత !

    Tags