Ajay Devgn vs Sudeep: కన్నడ సూపర్ స్టార్ సుదీప్ భిన్నమైన హీరో. నిజానికి పదేళ్ల క్రితమే సౌత్ లో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో. ఇప్పుడంటే కన్నడలో యశ్ లాంటి కొందరు పాన్ ఇండియా స్టార్లుగా చలామణి అవుతున్నారు గానీ, కన్నడలో మొదటి పాన్ ఇండియా స్టార్ సుదీప్ నే. ఈగ సినిమాతో సుదీప్ సౌత్ సినీ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు.
Ajay Devgn vs Sudeep
ఐతే.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన `కేజీఎఫ్ చాప్టర్- 2` ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకువెళ్తుంది. కాగా కన్నడ స్టార్ హీరో సుదీప్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఓ కన్నడ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందించారని అందరూ అంటున్నారు.
Also Read: Nikhil: షాకింగ్ : క్రేజీ హీరో తండ్రి కన్నుమూత !
ఐతే, ఇక్కడ నేను చిన్న కరెక్షన్ చేయాలని నిర్ణయించుకున్నాను. హిందీ ఎంత మాత్రం జాతీయ భాషగా నేను అంగీకరించను. నేడు బాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలను తీస్తోంది. ఆ సినిమాలతో తెలుగు, తమిళ భాషల్లో విజయం సాధించలేకపోతున్నారు. కానీ, ఈ రోజు మనం తెరకెక్కిస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తోంది’ అంటూ సుదీప్ ట్వీట్ చేశాడు.
Ajay Devgn vs Sudeep
కాగా హిందీపై ఈ కన్నడ హీరో సుదీప్ చేసిన వ్యాఖ్యలపై అజయ్ దేవ్‌గణ్ స్పందించాడు. ‘మీ ఉద్దేశం ప్రకారం.. హిందీ జాతీయ భాష కాకుంటే మీ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారు ? హిందీ ఎప్పటికీ జాతీయ భాషే’ అని ట్వీట్ చేశారు.
దీని పై సుదీప్ స్పందిస్తూ ప్రతి భాషను నేను గౌరవిస్తాను. అందువల్లే మీరు హిందీలో పెట్టిన నేను చదవగలిగా. అదే నేను కన్నడలో టైప్ చేస్తే మీ పరిస్థితేంటని ఆలోచిస్తున్నా’ అని బదులిచ్చాడు. మొత్తానికి సుదీప్ ఎక్కడా తగ్గడం లేదు. ఏది ఏమైనా హిందీ భాష పై సూపర్ స్టార్లు మధ్య వార్ నడవడంతో ఇది వైరల్ అవుతుంది.
Also Read:Pavan Kalyan Last Movie: పవన్ కళ్యాణ్ ఆఖరి మూవీ అదేనా..?
Recommended Videos: