Digilocker App: డ్రైవింగ్ చేస్తున్నావా? మామ పోలీసులు అడ్డా వేశారు? హో..షట్ డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయానే.. బస్ ఎక్కామా? అయ్యో రామా ఆధార్ కార్డ్ మర్చిపోయానే.. ఏదైన పని పడి పాన్ కార్డ్ అడిగారా? ఇంట్లో ఉంది అనే సమాధానం చెప్పాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ప్రభుత్వం జారీ చేసిన ఈ గుర్తింపు కార్డులు నిత్యం క్యారీ చేయాలి అంటే కష్టమే. కానీ చేయకతప్పదు. కనీసం జిరాక్స్ లు అయినా ఉండాల్సిందే. కానీ గుర్తు ఉంటుందా? మరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందిగా..
స్మార్ట్ ఫోన్ లో డిజిటల్ రూపంలో గుర్తింపు కార్డులు ఉంటే ఎంత బాగుండు కదా.. అవును ఉందిగా డిజీలాకర్ ఉండగా టెన్షన్ ఎందుకు? ఓసారి తెలుసుకోండి. డిజీలాకర్ ఎవరో కాదు ప్రభుత్వం తీసుకొని వచ్చిన డిజిటల్ ఫ్లాట్ ఫారమ్. ఇందులో సర్టిఫికెట్లు, పత్రాలు, సురక్షితంగా పొందుపరుచుకోవచ్చు. కావాల్సిన వాటిని సులువుగా యాక్సెస్ చేసుకోవచ్చు. పదోరతగతి సర్టిఫికెట్ నుంచి ఆధార్, పాన్, రేషన్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఎన్ని అయినా డాక్యుమెంట్ లను డిజిటల్ రూపంలో దాచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయి ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన సందర్భాల్లో డిజీలాకర్ లో ఉన్న పత్రాలు చూపించడం ఈజీ అవుతుంది. మరి వీటిని ఎలా వినియోగించాలో కూడా తెలుసుకోండి. అయితే మీ ఫోన్ లో డిజీలాకర్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోండి. పేరు పుట్టిన తేది ఫోన్ నంబర్, ఇ మెయిల్ వంటివి ఎంట్రీ చేయాలి. ఆధార్ లింక్ అయినా పోన్ నెంబర్ కు ఓటీవీ వస్తుంది. దాన్ని అక్కడ పొందుపర్చాలి. ఆ తర్వాత అకౌంట్ ను క్రియేట్ చేయాలి.
ఆధార్ నెంబర్ లేదా ఆరంకెల సెక్యూరిటీ సాయంతో సైన్ ఇన్ చేయగానే ఆధార్ కార్డ్ వివరాలు వస్తాయి. పైన ఫోటో కూడా వస్తుంది. సెర్చ్ సింబల్ ను క్లిక్ చేసి రాష్ట్రాన్ని ఎంచుకోగానే పదవతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ వంటి సర్టిఫికెట్లు కనిపిస్తాయి. ప్రాంతం, యూనివర్సిటీ లకు సంబంధించిన ఆప్షన్ లను ఎంచుకోగానే హాల్ టికెట్ నంబర్ లు, ఉత్తీర్ణత పొందిన సంవత్సరం ఎంటర్ చేస్తే చాలు డాక్యూమెంట్లు వస్తాయి. వీటితో పాటు పాన్, రేషన్ వంటి గుర్తింపు కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ISSUED లో కనిపిస్తాయి.