KL Rahul : లక్నోలో మంగళవారం జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ పై కేఎల్ రాహుల్ సూపర్ హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. 42 బంతులు ఎదుర్కొన్న అతడు మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ (34*) తో కలిసి మూడో వికెట్ కు అజేయంగా 56* పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అంతకుముందు లక్నో జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.. ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. 160 రన్స్ టార్గెట్ ను ఢిల్లీ జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే లాస్ అయ్యి.. 18.5 ఓవర్లలో ఫినిష్ చేసింది. ఈ మ్యాచ్ ద్వారా మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడి.. కేఎల్ రాహుల్ ఢిల్లీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. గత ఏడాది లక్నో జట్టు కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్.. ఏడాది తిరిగేసరికి లక్నో జట్టుకు ప్రత్యర్థిగా మారిపోవడం విశేషం. ఇక ఈ మ్యాచ్ సూపర్ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సాధించాడు.
Also Read : కేఎల్ రాహుల్ కూతురు పేరులో అంత అర్థం ఉందా?
అత్యంత వేగంగా
హాఫ్ సెంచరీ చేయడం ద్వారా కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో అత్యంత వేగంగా 5000 పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా నిలిచాడు.. 130 ఇన్నింగ్స్ లలో కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడుగా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరు మీద ఉండేది. వార్నర్ 135 ఇన్నింగ్స్ లలో 5000 పరుగులు పూర్తి చేశాడు. విరాట్ కోహ్లీ 157 ఇన్నింగ్స్ లు, ఎబి డివిలియర్స్ 161 ఇన్నింగ్స్ లు.. శిఖర్ ధావన్ 168 ఇన్నింగ్స్ లలో 5000 పరుగుల మైలురాయి అందుకున్నారు. అంతేకాదు ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా ఢిల్లీ జట్టు కూడా అరుదైన రికార్డు సృష్టించింది. ఐపీఎల్ సీజన్లో తొలి ఎనిమిది మ్యాచ్లలో ఆరు గెలిచి అరుదైన ఘనత అందుకుంది. 2009 లో ఆడిన తొలి మ్యాచ్లలో ఢిల్లీ ఆరు మ్యాచ్లు గెలిచింది. 2012, 2020, 2021, 2025*లో ఢిల్లీ జట్టు ఇదే విధంగా ఘనతను సాధించింది. టార్గెట్ చిన్నది కావడంతో.. ఢిల్లీ జట్టును త్వరగా ఆల్ అవుట్ చేయాలని లక్నో జట్టు కెప్టెన్ పంత్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా పవర్ ప్లే లో ఏకంగా ఐదుగురు బౌలర్లను ఢిల్లీ జట్టు మీదికి ప్రయోగించాడు. అయితే గతంలో హైదరాబాదు జట్టుతో మ్యాచ్ జరిగినప్పుడు పంజాబ్ జట్టు కెప్టెన్ పవర్ ప్లే లో ఆరుగురు బౌలర్లను ప్రయోగించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో లక్నో కెప్టెన్ ఐదుగురు బౌలర్లను రంగంలోకి దింపడం విశేషం.
Also Read : కేఎల్ రాహుల్ రివెంజ్ వెనుక.. అసలు కథ ఇదా
