Meter Collections: 3 రోజుల్లో గుండు సున్నా..’మీటర్’ తో కిరణ్ అబ్బవరం అరుదైన రికార్డు

Meter Collections: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన ‘మీటర్’ అనే చిత్రం ఇటీవలే విడుదలై డిజాస్టర్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సినిమాకి వచ్చిన డిజాస్టర్ టాక్ కి తగ్గట్టుగానే వసూళ్లు కూడా అంతకు మించి దారుణంగా వస్తున్నాయి. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు కేవలం 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇది అతి దారుణమైన వసూళ్లు అనే చెప్పాలి. కిరణ్ అబ్బవరం ఈ […]

Written By: Vicky, Updated On : April 10, 2023 7:52 am
Follow us on

Meter Collections

Meter Collections: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన ‘మీటర్’ అనే చిత్రం ఇటీవలే విడుదలై డిజాస్టర్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సినిమాకి వచ్చిన డిజాస్టర్ టాక్ కి తగ్గట్టుగానే వసూళ్లు కూడా అంతకు మించి దారుణంగా వస్తున్నాయి. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు కేవలం 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇది అతి దారుణమైన వసూళ్లు అనే చెప్పాలి.

కిరణ్ అబ్బవరం ఈ ఏడాది ప్రారంభం లోనే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో మంచి హిట్ కొట్టాడు.ఈ సినిమా సక్సెస్ అవ్వడం వల్ల ‘మీటర్’ చిత్రాన్ని 5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు బయ్యర్స్. ఇంత బిజినెస్ జరగడానికి ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్రాండ్ ఇమేజి కూడా కారణం అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే పాపం ఇప్పుడు బయ్యర్స్ పరిస్థితి చాలా దయనీయంగా మారింది.

ఎందుకంటే రెండవ రోజు ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు గుండు సున్నా..ఇక మూడవ రోజు అయితే కనీసం గ్రాస్ కూడా వచ్చే అవకాశాలు తగ్గిపోయిందట. థియేటర్స్ రెంట్స్ ఖర్చులకు మరియు కరెంటు ఖర్చులకు కూడా రాకపోవడం తో, సోమవారం నుండి ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో 70 శాతం థియేటర్స్ లో తీసి వేస్తున్నారట. మంచి హిట్ కొట్టి కెరీర్ లో మరో లెవెల్ కి వెళ్లాడని అందరూ అనుకుంటే చివరికీ ఇలా అయ్యిపోయాడని కిరణ్ అబ్బవరం ని ఇష్టపడే వాళ్ళు ఫీల్ అయ్యిపోతున్నారు.

Meter Collections

ఇప్పటి వరకు వచ్చిన ఆ పాతిక లక్షల షేర్ కూడా థియేటర్స్ రెంట్స్ రూపం లో మైనస్ అయ్యిపోతాయట. అంటే ఈ చిత్రానికి మూడు రోజుల్లో వచ్చిన వసూళ్లు అక్షరాలా సున్నా అన్నమాట. కిరణ్ అబ్బవరం కి ఇది డేంజర్ బెల్ లాంటిది, ఇక నుండి అయినా ఆయన మేలుకొని మంచి సినిమాలు చెయ్యకపోతే ఇండస్ట్రీ నుండి మాయమైపోతాడని అంటున్నారు విశ్లేషకులు.