
Kiara Advani Marriage: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి కైరా అద్వానీ.ఈమె తెలుగు లో భరత్ అనే నేను అనే సినిమా ద్వారా మనకి పరిచయమైంది.కాని మొట్టమొదట వెండితెర మీద కనిపించింది మాత్రం సుశాంత్ సింగ్ రాజ్ పుట్ హీరో గా నటించిన ‘MS ధోని’ అనే సినిమా ద్వారా.అలా ఈ రెండు సినిమాల ద్వారా బాగా పాపులరైన కియారా అద్వానీ కి టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో అవకాశాలు ఫుల్లుగా వచ్చాయి.
‘భరత్ అనే నేను’ తర్వాత ఈమె రామ్ చరణ్ తో కలిసి ‘వినయ విధేయ రామ’ అనే చిత్రం చేసింది.ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..ఇది ఇలా ఉండగా నిన్న కియారా అద్వానీ ప్రముఖ బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా తో వివాహం జరిగింది.
రాజస్థాన్ లోని జైసల్మీర్లోని వంటి సుందరవంతమైన ప్యాలస్ లో వీళ్లిద్దరి వివాహ మహోత్సవం కుటుంబ సభ్యులు మరియు అతిరథ మహారథుల సమక్షం లో అంగరంగ వైభవం గా జరిగింది.ఈ వివాహ మోహోత్సవానికి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు హాజరయ్యారు కానీ టాలీవుడ్ నుండి మాత్రం ఒక్కరు కూడా హాజరవ్వలేదు.తెలుగు లో ఆమె మహేష్ బాబు మరియు రామ్ చరణ్ వంటి హీరోలతో నటించి కూడా పిలవకపోవడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు.మహేష్ బాబు తో కియారా అద్వానీ పెద్దగా క్లోజ్ కానప్పటికీ రామ్ చరణ్ కి మాత్రం ఆమె బాగా క్లోజ్.

ప్రస్తుతం ఆయన తోనే ఒక సినిమా చేస్తూ ఉంది,అంత క్లోజ్ అయ్యినప్పటికీ కూడా పిలవకపోవడానికి ఒక కారణం ఉందట.సిద్దార్థ్ మల్హోత్రా కి సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే పెద్దగా నచ్చదట.అతని ఆదేశం మేరకే కియారా అద్వానీ టాలీవుడ్ హీరోలను ఆహ్వానించలేదని సోషల్ మీడియా లో ఒక రూమర్ జోరుగా ప్రచారం సాగుతుంది.ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో చూడాలి.