
Sidharth- Kiara Advani Wedding: పాన్ ఇండియా లెవెల్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ తో మోస్ట్ డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న కియారా అద్వానీ గత కొంతకాలం నుండి బాలీవుడ్ క్రేజీ హీరోలలో ఒకరైన సిద్దార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉందని, వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారంటూ బాలీవుడ్ మీడియాలో చాలాకాలం నుండి జోరుగా ప్రచారం సాగింది. దీనిపై ఈ ఇద్దరు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు కానీ, నేడు డైరెక్టుగా పెళ్లి చేసుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీళ్లిద్దరికీ సంబంధించిన పెళ్లి ఫొటోలే కనిపిస్తున్నాయి.
రాజస్థాన్ లోని జైసల్మర్ లోని ప్యాలస్ లో అంగరంగ వైభోగంగా జరిగిన ఈ వివాహ మహోత్సవం గురించి అనేక విశేషాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ గా మారాయి. ఈ వివాహాన్ని మీడియాకి దూరంగానే చేసారు. బాలీవుడ్ లో కియారా అద్వానీ కి బాగా క్లోజ్ గా ఉండే సెలెబ్రిటీలు హాజరయ్యారు కానీ టాలీవుడ్ నుండి మాత్రం ఒక్కరు కూడా రాలేదు.
అయితే ఈ వివాహ మహోత్సవం ప్యాలస్ లో జరిపించడానికి ఆరు కోట్ల రూపాయిల వరకు ఖర్చు అయ్యిందట..మూడు రోజుల పాటు ఈ వివాహ మహోత్సవం జరగనుంది. రోజుకి రెండు కోట్ల రూపాయిల వరకు అద్దె అవుతుందట..ఇక ఈ పెళ్ళికి వచ్చిన అతిథులకు సరైన పద్దతిలో మర్యాదలు చెయ్యడానికి కూడా కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్టు సమాచారం. వచ్చిన అతిథులను విమానాశ్రయం నుండి రిసీవ్ చేసుకునే దగ్గర నుండి వెళ్లే వరకు వాళ్ళ కోసం బీఎండబ్ల్యూ కార్లను ఏర్పాటు చేశారట.

అంతే కాదు వచ్చిన ప్రతీ అతిథికి ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ సదుపాయాలతో కూడిన రూమ్స్ ని కూడా బుక్ చేసినట్టు సమాచారం. ఇక ఈ వివాహానికి వాడిన దుస్తులు కూడా అత్యంత ఖరీదైనవి. మొత్తం మీద మూడు రోజుల పాటు జరగనున్న ఈ వివాహ మహోత్సవానికి 30 కోట్ల రూపాయిల వరకు ఖర్చు చేయబోతున్నట్టు సమాచారం
రోమన్ ఆర్కిటెక్చర్ ఎంబ్రాయిడరీతో నేసిన కియారా పెళ్లి లెహంగా
మంగళవారం సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్న కియారా అద్వానీ, రోమన్ ఆర్కిటెక్చర్‌కు సంబంధించిన క్లిష్టమైన ఎంబ్రాయిడరీ లెహెంగాను ధరించినట్లు డిజైనర్ మనీష్ మల్హోత్రా వెల్లడించారు. ఇది ” నూతన వధూవరులు పంచుకునే ప్రత్యేక ప్రేమతో ప్రేరణ పొందింది” అని అతను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఇక సిద్ధార్థ్ పెళ్లి వేడుక కోసం మెటాలిక్ గోల్డ్ షేర్వానీ ధరించాడు.