Bheemla Nayak KIA Holiday : భీమ్లానాయక్ మూవీ మేనియా దెబ్బకు ఆ దిగ్గజ కంపెనీ కూడా దిగివచ్చింది. ఏకంగా ఉద్యోగుల మూకుమ్ముడిగా సెలవు కోరడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించింది. పవర్ స్టార్ మూవీ కోసం ఉద్యోగులంతా సెలవు కోరడం వైరల్ గా మారింది. వకీల్ సాబ్ తర్వాత భీమ్లానాయక్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సినిమాలో పవన్ నటనను ట్రైలర్ చూసి ఎలాగైనా మూవీ చూడాలని ఆశపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా భీమ్లానాయక్ సినిమా విడుదలైంది. పవన్ తోపాటు రానా, నిత్యమీనన్, సంయుక్త మీనన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. తమన్ మ్యూజిక్ అందించాడు. మళయాల సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పమ్ కోషియం’ సినిమాకు రిమేక్ గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
Also Read: Celebrity praises on Bheemla Nayak Movie: “భీమ్లా నాయక్” పై సినీ ప్రముఖుల ప్రసంసల వర్షం
భీమ్లానాయక్ కోసం పవన్ ఫ్యాన్స్, ప్రజలే కాదు.. ఉద్యోగులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని అర్థమవుతోంది. తాజాగా అనంతపురంలోని దక్షిణకొరియాకు సంబంధించిన ప్రముఖ కార్ల కంపెనీ కియా కూడా సెలవు ప్రకటించింది. కియా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు భీమ్లానాయక్ చూసేందుకు మూకుమ్మడిగా సెలవు పెట్టారు.
సినిమా చూసేందుకు సెలవు కావాలని యాజమాన్యానికి లేఖ రాశారు. ఉద్యోగుల లేఖతో కియా కంపెనీ షాక్ అయ్యింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక చేసేదేం లేక ‘కియా హెచ్ఆర్ విభాగం సెలవు ప్రకటించింది. ఇక శుక్రవారానికి బదులు ఆదివారం విధుల్లోకి రావాలని కండీషన్ పెట్టింది. దీంతో సినిమా చూసిన ఆనందం ఓవైపు ఉన్నా.. దానికోసం మరోరోజు పనిచేయాల్సి వచ్చిందని ఉద్యోగులు హతాషులయ్యారు.
Also Read: Bheemla Nayak Collections: ‘భీమ్లా నాయక్’ ఏపీ & తెలంగాణ సెకండ్ డే కలెక్షన్స్
Recommended Video: