https://oktelugu.com/

‘క్రాక్’జోరులో ‘ఖిలాడి’ రవితేజ బర్త్ డే స్పెషల్

‘క్రాక్’ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ వెంటనే తన కొత్త సినిమాను ప్రారంభించేశారు. ఈరోజు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ‘ఖిలాడి’ ఫస్ట్ గ్లింప్స్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ‘ప్లేస్మార్ట్’ అంటూ కింద ట్యాగ్ ఇచ్చింది. ‘రాక్షసుడు’ వంటి హర్రర్ హిట్ చిత్రాన్ని తీసిన రమేశ్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వమిస్తున్నారు. పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సత్యనారాయణ […]

Written By: , Updated On : January 26, 2021 / 12:01 PM IST
Follow us on

‘క్రాక్’ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ వెంటనే తన కొత్త సినిమాను ప్రారంభించేశారు. ఈరోజు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ‘ఖిలాడి’ ఫస్ట్ గ్లింప్స్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ‘ప్లేస్మార్ట్’ అంటూ కింద ట్యాగ్ ఇచ్చింది.

‘రాక్షసుడు’ వంటి హర్రర్ హిట్ చిత్రాన్ని తీసిన రమేశ్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వమిస్తున్నారు. పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ ‘ఖిలాడీ’ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లు. నేడు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయిన ‘ఖిలాడి’ కాన్సెప్ట్ టీజర్ అదిరిపోయేలా ఉంది. ఫుల్ యాక్షన్ మూవీగా కనిపిస్తోంది.

రవితేజ చేతిలో సుత్తెను పట్టుకొని విలన్స్ ను వేటడానికి రెడీగా ఉన్న లుక్ ను టీజర్ లో చూపించారు. ఈచిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2021 సమ్మర్ లో విడుదల చేయనున్నారు.

#Khiladi Movie First Glimpse | Raviteja, Meenakshi Chaudhary | Dimple Hayathi |  Ramesh Varma | DSP