Homeఎంటర్టైన్మెంట్KGF Fans: నానా బూతులు తిడుతున్న కెజిఫ్ ఫ్యాన్స్... అయినా తగ్గని కంచరపాలెం డైరెక్టర్, మళ్ళీ...

KGF Fans: నానా బూతులు తిడుతున్న కెజిఫ్ ఫ్యాన్స్… అయినా తగ్గని కంచరపాలెం డైరెక్టర్, మళ్ళీ ఏమన్నాడంటే 

Director Venkatesh Maha - KGF
Director Venkatesh Maha – KGF

KGF Fans: కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహ కెజిఎఫ్ 2 మూవీని ఉద్దేశిస్తూ దారుణ కామెంట్స్ చేశారు. కెజిఎఫ్ 2 ఒక చెత్త సినిమా. అది పాప్ కార్న్ మూవీ. మేము తీసేవి కాదు కెజిఎఫ్ లాంటి చిత్రాలు ఓటీటీ చిత్రాలు. మేము కలం వదిలేసి కత్తి పట్టుకుంటే ఇంత కంటే గొప్ప చిత్రాలు చేస్తాము. మేము సెన్సిబుల్ దర్శకులం. రాఖీ భాయ్ ఒక నీచ్ కమీన్ కొత్తే. అసలు ఎవడు మాత్రం అలా చేస్తాడు. బంగారం మొత్తం సముద్రం పాలు చేస్తాడు… అంటూ తీవ్ర పదజాలంతో ఎగతాళి చేశారు. ప్రముఖ యాంకర్ ప్రేమ ఇంటర్వ్యూలో ఇది జరిగింది.

వెంకటేష్ మహ కామెంట్స్ ని పక్కనే ఉన్న నందినిరెడ్డి, మోహనకృష్ణ ఇంద్రగంటి, వివేక్ ఆత్రేయ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. గట్టిగా నవ్వేశారు. దీంతో వెంకటేష్ మహతో తో పాటు ఈ ముగ్గురు దర్శకులను కూడా కెజిఎఫ్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకున్న నేపథ్యం… మీరొక డైరెక్టర్స్ మీవొక సినిమాలు. కమర్షియల్ సినిమాలను విమర్శించే మీరు అలాంటి సినిమా ఒకటి తీసి చూపించండి. ప్రేక్షకాదరణ పొందిన కెజిఎఫ్ 2 చిత్రాన్ని విమర్శించే అర్హత మీకుందా? మీరు తీసిన సినిమాలు ఏమైనా కళా ఖండాలా? ఇదే కామెంట్స్ పుష్ప మూవీ మీద చేయగలరా? అని ఏకిపారేస్తున్నారు.

Also Read: Nabha Natesh: సైడ్ యాంగిల్ నుండి హాట్ స్పాట్ చూపించిన నభా నటేష్… చీరలో సూపర్!

Director Venkatesh Maha
Director Venkatesh Maha

విమర్శల దాడితో తలొగ్గిన నందినిరెడ్డి, వివేక్ ఆత్రేయ, మోహనకృష్ణ క్షమాపణలు చెప్పారు. వెంకటేష్ మహ సైతం ఒక వీడియో బైట్ విడుదల చేశారు. అతడు కెజిఎఫ్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. అయితే తన అభిప్రాయానికి కట్టుబడే ఉన్నట్లు వెల్లడించారు. నా అభిప్రాయం తెలిపే క్రమంలో నేను వాడిన భాష సరైనది కాదు. అందుకు నేను క్షమాపణలు చెబుతున్నారు.

ఇక నేను ఏ వ్యక్తిని తిట్టలేదు. ఒక కల్పిత పాత్రను మాత్రమే తప్పుబట్టాను. నా అభిప్రాయం సరైనదే అంటూ కొందరు ఫోన్స్, సందేశాలు చేస్తున్నారు. నేను ఒక క్యారెక్టర్ గురించి చేసిన కామెంట్స్ వ్యక్తులకు ఆపాదించవద్దు. క్షమాపణల్లో కూడా వెంకటేష్ మహ తలబిరుసు చూపిస్తున్నాడు. నువ్వు తీసిన కేరాఫ్ కంచరపాలెం ఒక చెత్త సినిమా. నీకు నువ్వు గొప్ప డైరెక్టర్ అనుకుంటే సరికాదని చురకలు వేస్తున్నారు. కెజిఎఫ్ 2 ఫ్యాన్స్ ఆగ్రహం కొనసాగుతుండగా… ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో చూడాలి.

Preethi Suicide: ప్రీతి మృతిపై అనుమానాలెన్నో.. ఈ 11 సందేహాలకు సమాధానమేదిP?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version